బాబు దగ్గరుంది నెత్తురు పీల్చిన డబ్బే

  • మూడున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల నెత్తుటి కూడు సంపాదన
  • చేసేది అవినీతి చెప్పేవి మాత్రం నీతివంతుడి సుద్దులు
  • 1978లో నీ ఆస్తి ఎంత చంద్రబాబూ?
  • నిజంగా సశ్చిలుడివైతే సీబీఐ ఎంక్వైరీ వేసుకో..
  • అవినీతితో విర్రవీగుతున్న చంద్రబాబును ప్రజాస్వామ్యం క్షమించదు
  • అవినీతి పాలనకు సమాధి కడతాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: ప్రజల రక్తమాంసాలు పీల్చి పిప్పి చేసి సంపాదించిన ఎర్రడబ్బు చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. అవినీతి అనే సిద్ధాంతంతో సంపాదించిన నెత్తుటి కూడు మూడు సంవత్సరాల కాలంలో రూ. 4 లక్షల కోట్లు అని భూమన ధ్వజమెత్తారు. విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతూ.. నా జీవితమంతా నీతి నిజాయితీలతో కూడుకున్నదని చంద్రబాబు సుద్ధులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు భారతదేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని 2004కు పూర్వమే మీడియా సంస్థలు, తెహల్కా డాట్‌ కామ్‌ అనే ప్రచార సంస్థ దేశ వ్యాప్తంగా చాటిచెప్పిందని గుర్తు చేశారు. 1978లో చంద్రబాబు ఆస్తి 2 ఎకరాలు ఉండగా.. 2014 నుంచి కేవలం మూడు సంవత్సరాల పాలనలో రూ. 4 లక్షల కోట్లు అవినీతితో సంపాదించారని సభ్య సమాజం అంతా ఈసడించుకుంటుందన్నారు. 

దేశ వ్యాప్తంగా చంద్రబాబు విషకోరలు..
1981లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బిక్షతో చంద్రబాబు మంత్రి అయ్యాడని భూమన గుర్తు చేశారు. ఆ తరువాత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ చలవతో అవినీతి బుద్ధితో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి దేశ వ్యాప్తంగా చంద్రబాబు తన విషసర్ప కోరలను చాచి సంపాదించాడన్నారు. ప్రపంచంలో సాదారణంగా నల్లడబ్బు, తెల్లడబ్బు ఉంటాయని, కానీ చంద్రబాబు వద్ద ప్రజల రక్తాన్ని పీల్చిన ఎర్రడబ్బు ఉందని ఆరోపించారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థలను మ్యానేజ్‌ చేస్తూ ఇతరులపై చంద్రబాబు నిసిగ్గుగా అభాండాలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని మండిపడ్డారు. 

అమరావతిలో చంద్రబాబు భూదందాలు...
చంద్రబాబు నిజంగా సచ్ఛీలుడైతే తన అవినీతి సంపాదనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు స్వయంగా తనకు తాను సీబీఐ ఎంక్వైరీ వేసుకోవాలని భూమన సూచించారు. అలా చేస్తేనే సభ్య సమాజం చంద్రబాబు నీతివంతుడని గుర్తిస్తుందన్నారు. ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి పారిపోయి అమరావతిలో తిష్టవేసింది నిజమా కాదా సమాధానం చెప్పాలన్నారు. అరెస్టు చేస్తారనే భయంతో నగరాన్ని విడిచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మ్యానేజ్‌ చేసుకొని కేసును నీరుగార్చాడన్నారు. అమరావతిని అభివృద్ధి చేయకపోగా.. భూదందాలు చేస్తూ చుట్టుపక్కల ఉన్న పోలాలను తన తాబేదారులకు అప్పనంగా అప్పగించి వేల కోట్లు అర్జించారని ధ్వజమెత్తారు. అమరావతిని సింగపూర్‌ కంపెనీకి అప్పగించడంలో మతలబు ఏంటని చంద్రబాబును భూమన ప్రశ్నించారు. 

లోకేష్‌ను విదేశాలకు ఎందుకు పంపారు..
రాజధాని నుంచి చిత్తూరు వరకు.. చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు చంద్రబాబు అవినీతి వేయి తలల విష సర్పంలా సామాన్యులను కాటువేసేలా తయారైందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికార పర్యటనకు జీవో జారీ చేసి లోకేష్‌ను ఎందుకు విదేశాలకు పంపించారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటూ తన అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. చంద్రబాబు, సోనియా గాంధీ ఇద్దరు కలిసి అన్యాయంగా, అక్రమంగా వైయస్‌ జగన్‌పై కేసులు బనాయించారని ఫైరయ్యారు. అయినా తప్పు చేయని వ్యక్తి కాబట్టి ధైర్యంగా ఇవాల్టీకి కేసులను ఎదుర్కొంటున్నాడని చంద్రబాబుకు చురకంటించారు. 

వైయస్‌ జగన్‌ నేతృత్వంలో రాక్షసపాలనను తరిమికొడతాం..
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాత వైయస్‌ రాజారెడ్డి 60 ఏళ్ల క్రితమే ఇన్‌కం ట్యాక్స్‌లు కట్టారనే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని భూమన అన్నారు. మీ తండ్రి ఖర్జూరపు నాయుడు ఒక్క రూపాయి అయినా ట్యాక్స్‌ కట్టాడా చంద్రబాబూ అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే హెరిటేజ్‌ లాభాలు ఏ విధంగా పెరిగాయో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు వ్యాపారం అవినీతి పాలనకు ముసుగు తప్ప మరొకటి కాదన్నారు. ఎల్లకాలం నీ అవినీతి పరిపాలన సాగదు చంద్రబాబూ పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. నంద్యాలలో రూ. 5 వందల కోట్లు కుమ్మరించి గెలిచి ఆ అహంకారంతో విర్రవీగుతున్న చంద్రబాబును ప్రజాస్వామ్యం ఎప్పటికీ క్షమించదన్నారు.  వైయస్‌ జగన్‌ నేతృత్వంలో వీరోచిత పోరాటాలు చేసి బాబు రాక్షస పాలనకు సమాధి కడతామని హెచ్చరించారు. 
Back to Top