నీ అబద్ధాలకు పంద్రాగస్టు మినహాయింపు లేదా?

  • రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తే తుంగలో తొక్కతున్నాడు
  • మూడేళ్లలోచంద్రబాబు  రూ.3.5 లక్షల కోట్ల  అవినీతి
  • దెయ్యాలు భగవద్గీత చదినిట్లుగా బాబు మాటలు
  • దేశ చరిత్రలో నికృష్టుడిగా పేరుగాంచిన చంద్రబాబు
  • 200ల లీటర్ల పెట్రోల్‌ అమ్ముకున్న నీచ చరిత్ర బాబుది
  • పప్పులాంటి కొడుకును కన్న చంద్రబాబు నిప్పు కాలేడు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
నంద్యాల: చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా కనీసం మినహాయింపు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు జెండా ఆవిష్కరించిన ప్రాంగణంలో గత మూడు సంవత్సరాల క్రితం ఎన్నికల సభలో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా పదుల సంఖ్యలో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. నంద్యాలలో భూమన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కాపులను బీసీల్లో చేర్చుతానని, రైతు, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, లేకపోతే రూ. 2వేల భృతి, రాష్ట్ర బలహీన వర్గాలకు రూ.10 వేల కోట్లు ఏటా కేటాయిస్తానని హామీ ఇచ్చారనిగుర్తు చేశారు. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇదే ప్రాంగణంలో పవిత్ర జాతీయ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి చట్టాలను పాతాలానికి తొక్కతూ అత్యద్భుతంగా మోసాలును ప్రకటించారన్నారు. చట్టాలను చేసే గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి చట్టాలపై ఏమాత్రం గౌరవం లేకుండా చట్టాలను నిర్లజ్జగా వ్యతిరేకిస్తూ తుంగలో తొక్కుతున్నాడన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నుంచి 21 మందిని కొనుగోలు చేసిన వ్యక్తి వారితో రాజీనామా చేయించలేకపోయారన్నారు. చట్టాలలోని లొసుగులను వాడుకోవడానికి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. 

నీ తోలుబొమ్మలతో పొగిడించుకుంటే సరిపోదు బాబూ
శిల్పా చక్రపాణిరెడ్డి మాదిరిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే చట్టాలకు, చట్ట సభలకు గౌరవం ఉంటుందని భూమన అన్నారు. 600ల అబద్ధాలతో అధికారంలోకి వచ్చి చంద్రబాబు వాటిని అమలు చేయకుండా రూ. 3.5 లక్షల కోట్లు అవినీతిని పొంగిపొర్లిస్తున్నాడన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున చంద్రబాబు సంబరాలు, సత్ఫలితాలు, చేయబోయే కార్యక్రమాల గురించి చెబుతుంటే దెయ్యాలు, భూతాలు భగవద్గీత చదవినిట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడికి వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. ముందు నీ చరిత్ర ఎలాంటి తెలుసుకొని మాట్లాడాలన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత నీచాతి నీచ రాజకీయాలు చేసేన నికృష్టుడిగా చంద్రబాబు పేరుగాంచాడని విమర్శించారు. నీ తోలుబొమ్మలతో పొగిడించుకుంటే సరిపోదని, రాజకీయాల్లో తలపండిన వాళ్లు చంద్రబాబు ఆదర్శనం అని చెప్పివుంటే బాబు సచ్చిలుడిగా ఉండేవాడన్నారు. 

బాబు రాజకీయ అరంగేట్రమే నీచమైంది
చంద్రబాబు ఎంత నీచమైన వ్యక్తో వీరరాఘవులు అనే రాజకీయ నేత చెప్పాడని భూమన గుర్తు చేశారు. 1977లో చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయని,  చిత్తూరు నియోజకవర్గానికి పోటీ చేసిన రాజగోపాల్‌ నాయుడు ఎన్నికలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న వీర రాఘవులు చంద్రబాబుకు ఒక జీపు, 200 లీటర్ల పెట్రోలు ఇచ్చి ప్రచారం చేయమంటే మరుసటి రోజే వచ్చి అన్నా.. మొత్తం తిరగేశా.. పెట్రోల్‌ అయిపోయిందని చెప్పాడంట. ఈ విషయాన్ని వీరరాఘవులు స్వయంగా తనతో చెప్పారన్నారు. 200ల లీటర్ల పెట్రోలు మాకు తెలిసిన పెట్రోల్‌ బంక్‌లో అమ్మేసి చంద్రబాబు తిరిగానని చెబితే ఆయన తిట్టాడని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రారంభం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాంటి చంద్రబాబు రాజకీయాల్లో నాలాంటి నిప్పు లేడు, ఉప్పులేడు అని మాట్లాడుతున్నాడంటే పప్పులాంటి కొడుకును కన్న చంద్రబాబు రాజకీయాల్లో నీతి గురించి నీతి గురించి మాట్లాడడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. 

వచ్చే ఎన్నికల్లో బాబు పాలనకు సమాధి
చంద్రబాబు పాలనకు వచ్చే ఎన్నికల్లో శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారని భూమన ఆరోపించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లుల్లా, జలగల్లా మానవరక్తాన్ని పీడిస్తున్న నరరూప రాక్షసులే తప్ప మరొకటి కాదని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. నీకు నువ్వే డబ్బాలు కొట్టుకుంటే వాస్తవం మరుగున పడిపోదు చంద్రబాబూ నీ పాలనంతా దుర్మర్గమని భూమన మండిపడ్డారు. చంద్రబాబుకు నిజంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు ఉంటే ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలో ఎందుకు అని ప్రశ్నించారు. నంద్యాలలో మీ అవినీతి సొమ్ముతో కనీసం రోజు 15 నుంచి 20 వేల మందిని కూలికి మాట్లాడుకొని ప్రచారానికి తిప్పుతున్నారన్నారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు పరిపాలనపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని, బాబును ఇంటికి సాగనంపడానికి ప్రజలంతా సలసల మరిగే నూనెలా ఎదురుచూస్తున్నారన్నారు. 
Back to Top