మంత్రులా..మంత్రగాళ్లా?

  • ఆర్కేనగర్ ఉపఎన్నిక కన్నా దారుణంగా తయారైన నంద్యాల ఉపఎన్నిక
  • రూ.వందలాది కోట్లను లారీల్లో తరలిస్తున్న చంద్రబాబు
  • అఘోరాల కంటే ఘోరంగా తయారైన మంత్రులు
  • వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పన్నాగం
  • టీడీపీ గూండాలతో పర్యటనకు ఆటంకం కలిగించేందుకు మంత్రుల కుట్ర
  • మూడేళ్లలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్ల అవినీతి
  • నంద్యాల ప్రజలారా..బాబు అవినీతి, అరాచక పాలనకు పాతరేయండి
  • వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
నంద్యాలః టీడీపీ గూండాలతో వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు మంత్రులు కుట్రలు చేస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్ నంద్యాలలో పర్యటిస్తున్నారగానే చంద్రబాబు వణికి చస్తున్నారన్నారు. శాంతియుత పద్ధతుల ద్వారా ఓట్లను అభ్యర్థించకుండా మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ అధికార దాహాన్నినంద్యాల వేదికగా వైయస్ జగన్ ఎండగడుతారని భూమన చెప్పారు. ప్రజల ఆకాంక్ష, ఆశయాలను నెరవేర్చేందుకు వైయస్సార్సీపీ కృతనిశ్చయంతో ఉందని అన్నారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే టీడీపీ భూ స్థాపితమవుతుందన్నభయంతో మంత్రుల చెప్పుచేతల్లో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించేందుకు పన్నాగం పన్నినట్టుగా అర్థమవుతోందన్నారు. ఇదేనా బాబు ప్రజాస్వామ్యం అని భూమన ప్రశ్నించారు. నంద్యాలలో ఉన్నది మంత్రులా లేక మంత్రగాళ్లో అర్థం కావడం లేదన్నారు. అఘోరాల కంటే అధ్వాన్నంగా ప్రజల ఆశయాలను చేతబడి చేసే మంత్రగాళ్లలాగ మంత్రులు తయారయ్యారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను బెదిరించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. నిజంగా మీరు అభివృద్ధి చేశారని అనుకుంటే మంత్రులంతా అమరావతిని వదిలి నంద్యాలలో ఎందుకు తిష్టవేశారని, 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు దించారని భూమన ప్రశ్నించారు.  

నంద్యాల ఉపఎన్నిక ఆర్కేనగర్ ఉపఎన్నిక కన్నా దారుణంగా తయారవుతోందని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నంద్యాలలో వందల కోట్ల అవినీతి సొమ్మును పంచుతూ...వైయస్సార్సీపీ నాయకులను బెదిరిస్తూ, ఓటర్లను ప్రలోభపెడుతోందని భూమన ధ్వజమెత్తారు. ప్రజలు బాబుపై తిరుగుబాటు చేస్తుండడంతో బరితెగించి హింసాయుత పద్ధతుల్లో గెలవాలని చూస్తున్నాడని భూమన ఆరోపించారు. టీడీపీ అరాచక పాలన, ఇచ్చిన వాగ్ధానాలకు భంగం కలిగించిన తీరును ఎండగట్టడం ప్రతిపక్షం బాధ్యత అని అన్నారు. చంద్రబాబు మూడేళ్లలో మూడున్నర లక్షల కోట్లు దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమకుందని అన్నారు. ఈ మూడేళ్లలో అధికారాన్ని సొంతానికి వాడుకుంటూ చంద్రబాబు ప్రజలను ఏవిధంగా మోసం చేశాడో ఎండగడుతామన్నారు. మీరు అభివృద్ధి చేసుంటే మీ పాలనపై నంద్యాల ప్రజలు ఎందుకు దండయాత్ర చేస్తున్నారో అర్థం చేసుకోవాలని బాబుకు హితవు పలికారు. వైయస్ జగన్ నంద్యాలకు వస్తుంటే అభివృద్ధి నిరోధకుడిని అడ్డుకోండంటూ బాబు మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు లాంటి అభివృద్ధి నిరోధకుడు దేశంలోనే లేడని భూమన అన్నారు.  మామను వెన్నుపోటు పొడిచి విశ్వాస పరీక్షను ఎదుర్కోని బాబు అప్రజాస్వామిక విధానాలను ప్రజలు నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరొందల హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చని బాబును ప్రతి గడప నిలువరించేందుకు సిద్ధంగా ఉన్నారని భూమన తెలిపారు. 

టీడీపీ పాలనకు వ్యతిరేకంగా అందరూ తిరగబడుతుండడంతో భయపడిపోయి... చంద్రబాబు ప్రతి ఒక్కరిని నులిపేయాలని చూస్తున్నాడని భూమన ఫైర్ అయ్యారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని భూమన అన్నారు.  కుట్రలు, కుతంత్రాలు, కుళ్లు రాజకీయాలు, మోసానికి మారు పేరు చంద్రబాబు అని భూమన ధ్వజమెత్తారు. నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో బాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం కూడ అంతే ఉంటుందని భూమన ఎద్దేవా చేశారు.  బాబు మూడేళ్లుగా  చేసిన ద్రోహానికి తీర్పు ఇచ్చేందుకు మొదటి అవకాశం నంద్యాల ప్రజలకు దక్కిందని.. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనను పాతరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భూమన తెలిపారు.  ప్రజలంతా వైయస్సార్సీపీ, వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిసి బాబు ఓటర్లను భయభ్రాంతులను గురిచేస్తూ  హింసాయిత వాతావరణం సృష్టిస్తున్నారని భూమన ఆగ్రహించారు. ముఠా రాజకీయాలు చేస్తూ పోలీస్ యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు జరపాలన్న కుట్ర చేస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, బాబు హింసాయుత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వందలకోట్లు పంచేందుకు చంద్రబాబు లారీల్లో 2వేల కోట్లను నంద్యాలకు తరలించారని భూమన ఫైర్ అయ్యారు.  ప్రజాస్వామ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నిఘా సంస్థలు, ఇన్ కం ట్యాక్స్ సంస్థలన్నీ బాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భూమన సూచించారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరే కుందేళ్లు వైయస్సార్సీపీలో లేరని భూమన అన్నారు. 
నంద్యాల ప్రజల పక్షాన మా నాయకుడు జగన్ నేతృత్వంలో పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. 

Back to Top