చంద్రబాబు దగుల్భాజి రాజకీయాలు

కాకినాడః నారావారి పాలన నీరోవారి పాలనకంటే అధ్వాన్నంగా తయారైందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చీడపురుగులా మారి ప్రజాద్రోహానికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు.  600 అబద్ధపు హామీలిచ్చి ప్రజలను దగా చేశాడని మండిపడ్డారు. రైతులు, యువకులు, మహిళల ఆక్రందనను చూసి కూడ చలించకుండా ముసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు నీచపు రాజకీయాలకు భరతం పట్టేందుకు కాకినాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు కాపుజాతికి, బీసీలకు, దళితులకు చేసిన అన్యాయానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. మొన్నటి ఎన్నికల్లో మోసపోయిన ప్రజలు మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేరన్నారు. నంద్యాల ప్రజలు బాబు పాలనకు వ్యతిరేకంగా ఏవిధంగా తీర్పు ఇవ్వబోతున్నారో కాకినాడ ప్రజలు కూడ అదేవిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  వైయస్సార్సీపీకి ఓటేసి మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే మా నాయకుడు వైయస్ జగన్ నాయకత్వంలో మార్పు తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమన ఇంకా ఏమన్నారంటే... 

నంద్యాల ఉపఎన్నిక తరహా కాకినాడలో బాబు కథాకళి వినిపిస్తున్నారు. మూడేళ్లలో బాబు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు.  దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు అత్యంత నీచుడిగా పేరు గాంచారు. కాకినాడకు వచ్చి సుద్దులు చెబుతున్నాడు. ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడకు పోయి మీ గ్రామాలను సస్యశ్యామలం చేయబోతున్నా, స్వర్గధామంగా మార్చబోతున్నానంటూ మోసం చేస్తున్నాడు. మూడేళ్లలో ఏ మలు చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అబద్ధాలకు తెరతీసి గోబెల్స్ కు అన్నగా మారిన పరమ నికృష్ట రాజకీయ నాయకుడు చంద్రబాబు. కాకినాడ లాంటి అత్యున్నతమైన నగరానికి వచ్చి తన అబద్ధపు మాటల విష వాయువులతో నగరాన్ని కాలుషితం చేస్తున్నాడు. ఈయనట కాపులకు మేలు చేశాడట. వైయస్సార్సీపీ కులాల మధ్య చిచ్చుపెడుతుందని మాట్లాడుతున్నాడు. కాపుల ద్రోహిగా మాగిలింది నీవు కాదా బాబూ..? కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తానని వేంకటేశ్వరుని పాదాలసాక్షిగా ప్రమాణం చేసి వారి జీవితాలతో చెలదాటమాడుతుంది నీవు. మీరు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చమని కాపు నాయకుడు  ముద్రగడ ఆధ్వర్యంలో కాపులు  పోరాటం చేస్తుంటే అణిచివేస్తున్నావ్. తునిలో రైలును దగ్ధం చేసింది తెలుగుదేశం నాయకులు. అలాంటి నీవా నీతి గురించి మాట్లాడేది. 

బీసీలకు పదివేల కోట్లు ఇస్తానన్నావ్.  ఒక్క రూపాయి విదిల్చిన పాపాన పోలేదు. దళిత వర్గాలు నీ పాలనపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వలేదు. ఉద్యోగం లేకపోతే నెలకు రూ. 2వేలు ఇస్తానని దగా చేశావ్. దేశంలోనే ఎవరూ చేయనంతగా రైతాంగానికి రుణమాఫీ చేసిన మహానుభావుడినంటూ బాబు కాకినాడకు వచ్చి పచ్చి అబద్ధం చెబుతున్నాడు . డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ మాఫీ చేశాడట. నీవు ఇచ్చిన హామీ నెరవేర్చని కారణంగా అప్పులకు వడ్డీలు కట్టలేక స్వయం ఉపాధి అవకాశాలను కోల్పోయారు. నీవు రుణమాఫీ చేయని కారణంగా పొదుపు సంఘాలన్నీ కుదేలవుతున్నాయి. అలాంటి డ్వాక్రా మహిళలకు నేను చేసిన మేలు ఎవరూ చేయడం లేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. పొదుపు సంఘాల మహిళలంతా బాబు చేసిన మోసానికి కళ్లు ఎర్రగా మారి కన్నీళ్లు చిందిస్తున్నారు.   నాకు ఓట్లు వేయండి.  ఎవరూ చేయని అభివృద్ధి చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. నీ మూడేళ్ల కాలంలో విభజిత రాష్ట్రం దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా పేరుగాంచడమే గాకుండా అత్యంత అవినీతి ముఖ్యమంత్రివి నీవేనని కోడై కూస్తోంది. కాగ్ నీపై అక్షింతలు వేస్తుంటే దులుపుకుంటున్నావు సిగ్గుగా లేదా బాబూ..?  అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒక్క మంచి పని కూడ చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావ్. అబివృద్ధి, సంక్షేమాన్ని పాతాళానికి తొక్కి మూడున్నరేళ్లలో మూడున్నర లక్షల కోట్ల సొమ్మును దోపిడీ చేశారు.  నంద్యాలలో వెదజల్లినట్టే ఇప్పుడు కాకినాడలో కూడ అవినీతి సొమ్మును వెదజల్లి ప్రజలను కలుషితం చేయాలని చూస్తున్నాడు.


అమరావతి భూముల విషయంలో బాబు దగాకోరు అవినీతిని ఎండగడుతూ సీబీఐ ఎంక్వైరీ వేయమంటే సమాధానం దాటవేస్తున్నాడు. విశాఖ భూకుంభకోణానికి సంబంధించి బాబు, కొడుకులు, తాబేదారులు  లక్ష ఎకరాల దోపిడీ దోచుకున్న దానిపై సీబీఐ ఎంక్వైరీ కోరితే తప్పించుకుతిరుగుతున్నారు.  వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబును మించిన వాడు లేడు. ప్రత్యర్థి సోనియాతో చేతులు కలిపి అక్రమంగా వైయస్ జగన్ ను 16 నెలలపాటు నిర్బంధానికి గురిచేసిన నీచాతి నీచ చరిత్ర గల దమననీతి బాబుది. అలాంటి నీవా సుద్దులు చెప్పేది. మా నాయకుడు వ్యక్తిత్వం కాలి గోటికి కూడ బాబు సరిపోడు.  ప్రజలు కోరిన విధంగా పోరాడే తత్వం, ఆలోచన, సిద్ధాంతం ఉన్న కుటుంబం వైయస్ఆర్ కుటుంబానిది.  దగుల్భాజి రాజకీయాలు చేస్తూ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అ అధికారం ఆ అంటే ఆదాయం ఈరెండు
లక్ష్యంగా రాజకీయాలు నడిపే నీతిలేని ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబువి హత్యా రాజకీయాలు. వైయస్సార్సీపీ వైయస్ఆర్ ఆలోచనలు, ఆశయాలతో నడుస్తున్న పార్టీ. విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాం కాబట్టే శిల్పా చక్రపాణిరెడ్డితో  రాజీనామా చేయించి జగన్ పార్టీలో చేర్చుకున్నారు. మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను బాబు  కోట్లాది రూపాయలు పోసి కొనుక్కున్నాడు.  ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేశాడు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించకుండా ఏకంగా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు.  రాజకీయం కోసం పబ్బం గడుపుకునే నీచ చరిత్ర చంద్రబాబుది.  విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి వైయస్ జగన్. అలాంటి నాయకుడిని విమర్శించే అర్హత బాబుకు లేదు.  నంద్యాలలో బాబు రాజకీయానికి సమాధి కట్టేందుకు పెట్టెలో భద్రపర్చి ఉన్నారు.
Back to Top