బాబువి నీచ రాజకీయాలు

ఎన్నికల హామీలు మరచి..వైయస్ జగన్ పై విమర్శలా
మహానాడులో  బాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు
రాష్ట్ర విభజనకు కారకుడు చంద్రబాబే
పరిటాల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నాడు
ఇప్పుడు వైయస్‌ఆర్, పరిటాల కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాడు
దమ్మూ, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే అవినీతిపై విచారణకు సిద్ధపడాలి
బాబుకు భూమన కరుణాకర్ రెడ్డి సవాల్

హైదరాబాద్‌: ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేసేందుకే ...చంద్రబాబు మహానాడు వేదికను వాడుకుంటున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అంశాలపై మహానాడులో చర్చించకుండా ...వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే ఎజెండాగా పెట్టుకొని మాటల దాడికి దిగుతున్నారని భూమన ఫైరయ్యారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. 

తిరుపతి వెంకన్న సాక్షిగా  ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇవ్వాలన్న చంద్రబాబు...ఇప్పుడు ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదన్నారు.  రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు...మాపీ చేయకుండానే మహానాడులో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతుల రుణాలు సమసిపోయాయా, అధికం అయ్యాయా..? చంద్రబాబు ఒకసారి తనకు తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా అని మాట్లాడిన చంద్రబాబు... ఇంత వరకు దానిపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. చంద్రబాబు సమీక్షకున్న అసలు అర్థాన్ని మార్చేశారని ధ్వజమెత్తారు. వాగ్ధానాలు, హామీలు అధికారం చెరబట్టేందుకే అన్నట్లుగా బాబు వైఖరి ఉందన్నారు.  ప్రజాసమస్యలపై అనునిత్యం పోరాడుతున్న వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేసేందుకే మూడు రోజుల మహానాడులు జరుగుతున్నాయని బాబు మాటల్లో అర్థమవుతుందన్నారు. 

రాష్ట్రాన్ని విడగొట్టింది బాబే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టేందుకు చంద్రబాబునాయుడు పూర్తి సహాయ సహకారాలు అందించారని భూమన ఆరోపించారు. 2008లో దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉండగానే రాష్ట్రాన్ని విడగొట్టేందుకు పోలిట్‌బ్యూరో తీర్మాణం ద్వారా కుట్రలు పన్నారన్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టేందుకే మద్దతు ప్రకటించారని చెప్పారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చేందుకు చంద్రబాబు అప్పటి కేంద్ర మంత్రులు చిదంబరం, షిండేలకు లేఖలు పంపించింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. లోక్‌సభలో రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ఓటింగ్‌ జరుగుతుంటే నామా నాగేశ్వర్‌రావు విడగొట్టమని చేతులు ఊపుతూ.. కాలర్‌ ఎగురవేసుకుంటూ పార్లమెంట్‌ నుంచి బయటకు వచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు పచ్చిగా సహకరించి ఆ పాపాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రుద్దుతున్నారని ఫైరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించవద్దని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఊరూరు తిరుగుతూ పోరాటాలు చేశామన్నారు. హైదరాబాద్‌లో లక్షల మందితో వైయస్‌ జగన్‌ దీక్ష కూడా చేశారని చెప్పారు. ప్రజలు ఏం చెప్పినా వింటారన్న భ్రమలో  చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. 

కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్న బాబు
మహానాడు వేదికపై వైయస్‌ఆర్, పరిటాల కుటుంబాల మధ్య చిట్టుపెట్టి ఆ మంటల్లో చలికాచుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నాడని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. సూటికేసు బాంబుతో వైయస్‌ జగన్‌ పరిటాల రవింద్రను చంపడానికి ప్రయత్నించాడని చెప్పడం బాబు కుట్రపూరిత చర్య అని పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్షనేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన కుమారుడు తప్పు చేస్తే ఉరితీయడానికైనా సిద్ధపడతాను అంటూ వెంటనే సీబీఐ విచారణ వేయమని చెప్పిన మాటలు మర్చిపోయావా అని చంద్రబాబును నిలదీశారు. పరిటాల రవి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుందే చంద్రబాబు అని భూమన గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ పరిటాల రవిని ఆదరించి మంత్రిపదవి ఇస్తే చంద్రబాబు అది ఓర్వలేక రవి రాజకీయ భవిష్యత్తును సమాధి చేశారని చెప్పారు. వైయస్‌ఆర్‌ కుటుంబానికి, పరిటాల కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేవని ఆయన చెప్పారు. దివంగత వైయస్‌ రాజారెడ్డి మరణిస్తే పరిటాల వచ్చి ఘనంగా నివాళులర్పించారని, సంక్షోభంలో ఉన్న రవిని వైయస్‌ రాజారెడ్డి అనంతపురం వెళ్లి పరామర్శించి వచ్చారన్నారు. అలాంటి సన్నిహిత కుటుంబాల మధ్య చంద్రబాబు మహానాడు వేదికగా చిచ్చుపెట్టాలనుకుంటున్నాడని మండిపడ్డారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులు జేసీ దివాకర్‌రెడ్డిని, మిగతా వారందరినీ హక్కున చేర్చుకుంది నీవు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

అవినీతిని అడ్డుకుంటున్నాం... 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై భూమన ఘాటుగా స్పందించారు. పట్టిసీమ, అమరావతి పేర్లతో చంద్రబాబు, ఆయన కోటరీ చేస్తున్న అవినీతి దోపిడీని అడ్డుకుంటున్నాం తప్ప రాజధానిని అడ్డుకోవడం లేదన్నారు.  చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం, సిగ్గు, లజ్జ, ఎగ్గు ఏమాత్రం ఉన్నా వెంటనే అమరావతి, పట్టిసీమ అవినీతిపై సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. పనిగట్టుకొని చంద్రబాబు వైయస్‌ జగన్‌పై ఆరోపణలు దిగుతున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు అవకాశాన్ని స్వార్థ రాజకీయాల కోసం సంక్షోభంగా మార్చే నిపుణుడు అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మిత్రపక్షమైన బీజేపీపై ఒత్తిడి కూడా తీసుకురావడం లేదన్నారు. పైగా ప్రత్యేక  హోదా సంజీవనా, ప్రత్యేక హోదాతో  ఏం ఉపయోగం  అంటూ పూటకు ఒక మాట మాట్లాడుతూ మతిభ్రమించినట్లుగా ప్రవర్తిస్తున్నాడన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి అప్పగించకుండా పట్టిసీమను తీసుకువచ్చి రాయలసీమను రతనాల సీమగా మార్చుతానని చెప్పిన మాటలే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు... మూడు రోజుల తరువాత  మహానాడు చక్కర తీసేసిన పిప్పిగా మారుతుందని ఎద్దేవా చేశారు. 

భక్తుల మనోభావాలను కించపర్చిన బాబు
భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు కలెక్టర్‌ల సమావేశంలో వ్యాఖ్యలు చేశారని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. దేవాదాయ శాఖ ఆదాయం 27 శాతం పెరిగింది. పాపులు ఎక్కువయ్యారు. అధికంగా పాపాలు చేసే పాపులు దేవుడికి అధికంగా డబ్బులు చెల్లిస్తున్నారని చంద్రబాబు అనడం తెలుగు ప్రజలు భగవంతుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని కించపరిచినట్లేనని దుయ్యబట్టారు. అంతే కాకుండా ప్రజలు తాగుడు మానడానికే అయ్యప్ప దీక్షలు చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ప్రజలకు తాగుబోతులను చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. నిత్యం తిరుపతి వెంకన్నకు నేను అపరభక్తుడిని అని చెప్పకుంటున్న చంద్రబాబు.. దేవుడు భక్తులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని నిలదీశారు. చంద్రబాబుకు భక్తి ఒక ముసుగు అని, తెలుగు ప్రజలు నిత్యం పూజించే ముక్కోటీ దేవతలు నీ దృష్టిలో దయ్యాలా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికార లాలస, స్వార్థం తప్ప మరొకటి లేదని భూమన మండిపడ్డారు. ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా ...ఎన్నికల్లో ఇవ్వని వాగ్ధానాన్ని మాత్రం చక్కగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తానని ఎన్నికల్లో చెప్పకపోయినా దానిని మాత్రం సక్రమంగా సాగిస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు ఇప్పటికైనా పరనిందే లక్ష్యంగా కాకుండా చేసిన తప్పులకు లెంపలేసుకొని పరిపాలన సాగించాలని డిమాండ్‌ చేశారు. 
మప
మనస్ఫూర్తిగా అంగీకరించాం.
వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నాయకులంతా మనస్ఫూర్తిగా అంగీకరించారని భూమన చెప్పారు. పార్టీ కోసం నిబద్ధతతో సుశిక్షుతుడై సైనికుడిలా పనిచేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని అభివర్ణించారు. 

తాజా ఫోటోలు

Back to Top