వైయస్‌ఆర్‌ సీపీ నేతపై హత్యాయత్నంఅనంతపురం: తాడిపత్రిలో హింసారాజకీయాలు ఎక్కువయ్యాయని, శాంతిభద్రతలు క్షీణించాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రమేష్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నేత రమేష్‌రెడ్డిని హత్య చేసేందుకు దుండగుడు ఆయన ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ క ఓసం లైసెన్స్‌ తుపాకీతో రమేష్‌రెడ్డి కాల్పులు జరిపారు. దుండగుడు తాడిపత్రి వాసి బాలచంద్రంగా గుర్తించి వెంటనే రమేష్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. తనపై హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తనపై హత్యకు కుట్ర జరుగుతుందని తనకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. 
 
Back to Top