స్థాయి మరచి మాట్లాడుతున్నారు

  • బాబుకు సొంత డబ్బా  అలవాటైపోయింది.
  • సభలో యనమల అనవసర కామెంట్లు చేస్తున్నారు
  • మీరేమైనా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదివారా?
  • ఎదుటి వారిని కించపరచటం ఆయన హోదాకు తగదు
  • వెయ్యి కోట్ల పరిశ్రమ ఒక్కటైనా తెచ్చారా?
  • ఆక్వా పార్కుపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
విజయవాడ: అధికార  పార్టీ నాయకులు స్థాయి మరచి ప్రతిపక్ష సభ్యులను హేళనగా  మాట్లాడుతున్నారని, వారికి సంస్కారం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై మంత్రులు చేసిన కామెంట్లను ఆయన తీవ్రంగా ఖండించారు. గవర్నర్‌ ప్రసంగం రొటిన్‌గా ఉందని, అందులో అన్ని తప్పుడు లెక్కలే చూపారని బుగ్గన ఫైర్‌ అయ్యారు. రాష్ట్రం 12 శాతం వృద్ధి రేటు సాధించిందని చెబుతున్నారు. ఇది తప్పు అని వైయస్‌ జగన్‌ లెక్కలతో సహా నిన్న అసెంబ్లీలో చెప్పారని వివరించారు. స్థూల ఉత్పత్తులు అన్నవి కేవలం అంచనాలు మాత్రమే. రెవెన్యూ అన్నది మనకు పన్ను రూపంలో వచ్చే రాబడి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏడు శాతం స్థూల ఉత్పత్తి ఉంటే ఏవిధంగా 12 శాతం వస్తుందని బుగ్గన ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ముఖ్యమైన ఫిషరిస్‌ రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. హెచరీస్‌ ఉన్న చోట ప్రభుత్వం ఫార్మా కంపెనీలు ఎందుకు పెడుతున్నారు. కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమ పెడితే రేపు మత్స్యపరిశ్రమ కుంటుపడే వీలుంది. ఇదే జరిగితే మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఇంకా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలు ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే..మీకు పరిశ్రమలు ఇష్టం లేదని ప్రభుత్వం అంటోంది. ఎవరు చెప్పారు ఇష్టం లేదని?. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారు..పరిశ్రమలు అనుకూలమైన ప్రాంతాల్లో పెట్టమని, పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం నుంచి ప్రజలను కాపాడండి అన్నారే తప్ప?  పరిశ్రమలను ఎప్పుడు వద్దనలేదు.

ఈ లెక్కలేంటండీ?
పెట్టుబడుల గురించి గవర్నర్‌ ప్రసంగంలో బ్రహ్మాండంగా చెప్పారు. నిన్న పొద్దున ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దాదాపు రూ.4.50 లక్షల కోట్లు ఎంవోయూలు వచ్చాయన్నారు. అందులో దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆల్‌రెడీ ఫైనలైజ్‌ అయినట్లు చెప్పారు. దానికి గాను 2.30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయట. ఈ లెక్కలేంటండీ..ఎక్కడి నుంచి ఈ లెక్కలు చెబుతున్నారు. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ పాలసీ అనే శాఖ ఉంటుంది,  ఢీల్లీలో దీనికి మరో శాఖ ఉంటుంది. ఐఏఎంలో ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. డ్రైవింగ్‌ చేయాలంటే ఫస్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏవిధంగా తీసుకుంటామో?, వ్యాపారం చేయాలంటే ఇన్‌కం ట్యాక్స్‌ ప్యాన్‌ నెంబర్‌ తీసుకుంటామో? అలాగే పరిశ్రమలు పెట్టడానికి ఐఏఎం తీసుకోవాల్సి ఉంటుంది. ఐఏఎం లెక్కల ప్రకారం డాక్యుమెంట్లు చూస్తే మొత్తం 2016 డిసెంబర్‌ వరకు దేశానికంతా కలిపి రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మీరు చూస్తే ఒక్క ఏపీకే ఏడాదికి రూ.2.30 లక్షల కోట్లు వచ్చాయని చెబుతున్నారు. ఆ విషయాన్ని వైయస్‌ జగన్‌ పాయింట్‌ అవుట్‌ చేస్తే..మీకు పరిశ్రమలు రావడం ఇష్టం లేదని అంటున్నారు. నిజం చెబితే టీడీపీ నేతలకు నచ్చడం లేదు. వైయస్‌ జగన్‌ ఇంకేం చెప్పారంటే..సెంట్రల్‌ గవర్నమెంట్‌ లేబర్‌ మినిస్ట్రీ నుంచి లేబర్‌ బ్యూరో వాళ్లు ఒక డేటా విడుదల చేశారు. అది ఏంటంటే..ఆటో మొబైల్, ఐటీ రంగం, మెటలర్జి, జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ రంగం, లెదర్, టెక్సైల్స్‌ రంగాలు అన్ని కలిపితే కూడా 2015వ సంవత్సరానికి 1.35 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని లేబర్‌ శాఖ ప్రకటించింది. ఏపీలో మాత్రం లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చాయని అబద్ధాలు చెబుతున్నారు. గతంలో టీడీపీ నేతలు ఏం చెప్పుకున్నారు. సత్యనాదేళ్లకు మేమే స్ఫూర్తినిచ్చామని చెప్పారు. నేను స్ఫూర్తి నిచ్చినందుకే ఆయన చదివాడని చంద్రబాబు గతంలో చెప్పుకున్నారు. పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే ఆమెకు బాబే స్ఫూర్తి అన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సైన్స్‌ కాంగ్రెస్‌లో ఏపీ సీఎం ఏమన్నారండీ. ఎవరికైనా నోబుల్‌ బహుమతి వస్తే వంద కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఎవరు ఎక్కడ ఏం సాధించినా కూడా దాన్ని ఓన్‌ చేసుకోవడం బాబుకు అలవాటు అయ్యింది. ఎదుటి పార్టీ నేతలను కించపరచడం, హేళన చేయడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఇదేం పద్దతి. మీ వయస్సుకు, మీ హోదాకు ఇది తగునా?. మాట మాట్లాడితే మీరు ఏం చదువుకున్నారో మాకు తెలియదని అంటున్నారు. మీరేమైనా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదివారా?. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఏమైనా చదివారా?. మీరు(యనమన  రామకృష్ణుడు) మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ యూనివర్సిటీలోనే కదా సార్‌?. పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ లేకపోయిందా?. ఏంటీ సార్‌ ఇది. రోశయ్య సక్సెస్‌ఫుల్‌ ఫైనాన్స్‌ మినిస్ట్రర్‌గా పనిచేశారు. ఆయన ఏం చదివాడండీ. మీకు తెలియదా? ప్రతి ఒక్కరిని కించపరచడం, హేళన చేయడం, ఎడ్యుకేషన్‌ గురించి మాట్లాడటం, ఏమన్న అంటే ప్రిపరేషన్‌ అంటున్నారు. ఎవరైనా కూడా ఒక డాక్యుమెంట్‌ ప్రిపర్‌ కావాలంటే ఆటోమాటిక్‌గా దానికి సంబంధించిన సబ్జెట్‌ అంతా తెలుసుకోవాలి.

ప్రతి ముద్దకు రైతులను తలుచుకుంటాం..
రైతులు పెట్టిన భోజనం మీరు తినలేదని అంటున్నారు. ఇదేంటండీ? ఆర్థిక శాఖ మంత్రి గారు..మీకు తెలుసో? లేదో?. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన విలువలు, మహానేతకు రైతుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో మేం ప్రతి రోజు తినే ప్రతి ముద్దాలో కూడా రైతును తలుచుకొనే తింటున్నాం. ఎందుకంటే రైతు కష్టం తెలుసు కాబట్టి.  మీరు ఒక్క పూట ఏదో ప్యాషన్‌ కోసం ఒక్క పూట తిని, మమ్మల్ని తినలేదంటున్నారు. ఇవన్నీ కూడా మీ స్థాయిలో ఉండేవాళ్లు మాట్లాడే మాటలేనా? అయ్యా..యనమల రామకృష్ణుడు మీరు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కదా? 2004–2014 మధ్యలో రూ.10 వేల కోట్ల సర్‌ఫ్లస్‌ రావడమేమి,

అది మీ రికార్డు..
రాష్ట్రం ముందుకు వెళ్లేది ఇష్టం లేదు అంటున్నారు. ఇటువంటి ప్రతిపక్ష నేత ఎప్పుడు లేడు అంటున్నారు. ఇటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడైనా ఉన్నాడా అని  మేం కూడా మాట్లాడవచ్చు. ఇంతకు ముందు మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా? మీకు పాత ట్రాక్‌ రికార్డు ఉన్నప్పుడు చంద్రబాబు సీఎం అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండేది. రెవెన్యూ లోటు ఎరగని రాష్ట్రం ఏపీ. చంద్రబాబు 1998 నుంచి 2004లో దిగి పోయే సమయానికి రూ.22 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. 2014లో బాబు సీఎం అయ్యే నాటికి రెవెన్యూ సర్‌ఫ్లస్‌లోకి వచ్చిన మాట నిజమా? కాదా?. 1994–2004 వరకు రూ.22 వేల కోట్లు డెఫిసిట్‌ ఏవిధంగా వచ్చింది?. ఇదంతా మీరు చేసిన ఘనత కాదా?. మీ రికార్డు ఏది చూసినా కూడా అంతే. 19984 నుంచి 1994 వరకు స్థూల ఉత్పత్తి చూసినా కూడా 5 శాతం పెరుగుదల, 1994 నుంచి 2004 వరకు 6 శాతం, 2004 నుంచి 2009 నాటికి దాదాపు 10 శాతం స్థూల ఉత్పత్తి పెరిగింది. ఇవన్నీ కూడా లెక్కలు తప్పా?

అవార్డులు మీకు..రివార్డులు పక్క రాష్ట్రాలకు
టీడీపీ నేతలకు ఒక్కటే అలవాటు అయ్యింది. మాకు అవార్డులు వచ్చాయి..మీరు తట్టుకోలేరని విమర్శిస్తున్నారు. నిజమే..ప్రత్యేక విమానాల్లో దాహోస్‌ వెళ్లిన అవార్డు మీకే సొంతం. బెస్ట్‌ బిజినెస్‌మ్యాన్‌ అవార్డు మీకే వచ్చింది. డ్రీమ్‌ క్యాబినెట్‌లో మీ మంత్రులకే చోటు దక్కిందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మీకు అవార్డులు ఇచ్చిన వారికి సిల్వర్‌ చార్మినార్‌లు, హైదరాబాద్‌ బిర్యానీలు ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు. అవార్డులు మీరు తీసుకున్నారు..రివార్డులు ఎవరికి పోయాయి?. రివార్డులు అన్ని కూడా తమిళనాడు, మహారాష్ట్రలకు దక్కాయి. మీ హయాంలో గట్టిగా వెయ్యి కోట్ల ఇండస్ట్రీ వచ్చిందని చెప్పగలరా? . మాట్లాడితే చదువు సంద్య గురించి మాట్లాడుతున్నారు. అయ్యా మేం చదువుకున్న చదువు మాకు తెలుసు. మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసు. ప్రజలు ఇవన్ని చూస్తున్నారు. ఒక్కటి మాత్రం మాకు తెలుసు. మేం చదువుకున్న స్కూల్స్‌ కానీ, మా తల్లిదండ్రులు సంస్కారం మాకు నేర్పించారు. హేళన చేయడం, అనవసరంగా మాట్లాడటం వంటివి మాకు నేర్పించలేదు. ఎదుటి వ్యక్తిని గౌరవించడం, మనదంటూ తప్పు ఉంటే ఒప్పుకోవడం, తప్పు లేనప్పుడు ఎంతటి పరిస్థితిలో కూడా తల ఎత్తుకొని తిరగడం మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు.  మీ మాదిరిగా కించపరిచి మాట్లాడటం నేర్పించలేదు. ఈ రోజు యువకులు మరో ఇరవై ఏళ్లు పరిపాలన చేయలనుకున్న వారు ప్రిపెర్‌ అవుతారు. అన్ని తెలుసుకుంటే రేపు మంచి పరిపాలన వస్తుందని సంతోషపడాలి కానీ. మీరు మాకు చెప్పే బదులు, మాతో మీరు చెప్పించుకునే పరిస్థితికి వచ్చారంటే దురదృష్టకరం. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top