బడ్జెట్ అంతా అభూత కల్పన

హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా అభూత కల్పన అని ప్రతిపక్ష నేత,
వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్  అభివర్ణించారు.
అసెంబ్లీ లో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రవేశ
పెట్టాక, అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీడియాతో చిట్ చాట్
చేశారు. బడ్జెట్ లోని డొల్లతనాన్ని ఆయన సంక్షిప్తంగా వివరించారు. లేనివి ఉన్నట్లుగా
గణాంకాల్లో చూపించారని ఆయన అభివర్ణించారు. వ్యవసాయ కేటాయింపులు చూస్తే దారుణంగా
ఉన్నాయని జన నేత జగన్ అభిప్రాయ పడ్డారు. రుణమాఫీకి ఇచ్చిన నిధులు కనీసం వడ్డీలో
మూడోవంతుకు కూడా సరిపోవని అన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్
ఒకేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలు, కాపులకు చేసిన కేటాయింపులు సరిగ్గా
లేవని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

Back to Top