వైయస్సార్‌సీపీ నాయకుల ఎంట్రీతో సిండికేట్‌కు బ్రేక్‌

– ఏళ్లతరబడిగా జరిగిన దోపిడి
– పాత బస్టాండు గుత్త వేలం రూ.9.26లక్షలకు ఖరారు
– మూడురెట్లు పెరిగి మున్సిపల్‌ ఆదాయం
హిందూపురం అర్బన్: మున్సిపాల్టీ పరిధిలో మార్కెట్‌..బస్టాండు ఇతరాల వేలంపాటలను సిండికేట్‌గా మారి ఏళ్లతరబడిగా చేసిన దోపిడికి వైయస్సార్‌సీపీ నాయకుడు ప్రశాంత్‌గౌడ్‌ బ్రేక్‌లు వేస్తూ వచ్చారు. ఆయన ఏ టెండరు దాఖలుకు హాజరైన సిండికేట్‌ను బద్దలుకొట్టి ప్రభుత్వ ఆదాయం పెరిగేటట్లు చేశారు. ఇదే క్రమంలో బుధవారం పరిగి బస్టాండులోని ఖాళీస్థలంలో గుత్తలు వసూలు చేసుకునే కంట్రాక్టుకు కమిషనర్‌ విశ్వనాథ్‌ అధ్వర్యంలో జరిగిన వేలంపాటలో వైయస్సార్‌సీïసీ నాయకులు పాల్గొని గత ఏడాదికంటే మూడింతలు అధికంగా వేలం పాడి మున్సిపాల్టీ ఆదాయం గణనీయంగా పెంచారు. గత ఏడాది ఈ పరిగిబస్టాండు వేలం పాట కేవలం రూ. 3.81లక్షలు మాత్రమే ఉండేది, ఈవేలాన్ని ప్రతిసారి కంట్రాక్టర్లు, అదికారపార్టీ నాయకులు సిండికేట్‌గా మారి మున్సిపాల్టీ ఆదాయానికి గండికొడుతూ వచ్చారు. ఈసారి కూడా ఇదేరీతిలో అధికారపార్టీనాయకులు, కౌన్సిలర్లు సిండికేట్‌ చేయడానికి ప్రయత్నించారు. ప్రశాంత్‌గౌడ్‌ వేలంపాటలో పోటీపడరాదని వాదనలకు దిగారు. అయినా పట్టించుకోకుండా వైయస్సార్‌సీపీ నాయకులు పోటీపడి వేలం పాడసాగారు. చివరకు రూ. 9.26లక్షలకు వైయస్సార్‌సీపీ నాయకుడు రామాంజినేయులు వేలాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శలు చేయసాగారు. అయినా ఖాతారు చేయకుండా ప్రశాంత్‌ నాయకత్వంలో వైయస్సార్‌సీపీ నాయకులు పోటాపోటీగా వేలం పాడి కైవసం చేసుకున్నారు. ఇదేరీతిలో గతనెలలో నిర్వహించి మార్కెట్‌ వేలంపాటలో వైఎస్సార్‌సీపీ నాయకులు పోటీపడటంతో వేలం అధికంగా రూ. 31.20లక్షలకు ఖారైంది. అంతకు మునుపు కేవలం రూ.14లక్షలవరకు మార్కెట్‌ వేలం ఖరారు అయ్యేది. వైఎస్సార్‌సీపీ నాయకుల ఎంట్రితో ఒక్కసారిగా రూ.30.10లక్షలకు పెరిగింది. కాగా ప్రస్తుతం జరిగిన పరిగి బస్టాండు వేలం పాట కూడా రూ.23లక్షలకు వరకు వేలం పాడి రెండుసార్లు రద్దు అయ్యింది. వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రవేశంతోనే ఒక్కసారిగా మూడింతలు అధికానికి వేలం ఖారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఫోటోలు

Back to Top