కేటాయింపుల్లో ఉల్లంఘన

–బడ్జెట్‌ ప్రసంగంలో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
–కేటాయింపులకు, ఖర్చుల మధ్య వ్యత్యాసం
–విద్యుత్‌ కొనుగోలులో స్కాం
–మూడేళ్లుగా కరువుతో అల్లాడుతుంటే రెయిన్‌గన్లతో పారద్రోలామని గొప్పలు
–పరిశ్రమల ఏర్పాటు చేయకుండానే అసత్యాలు
–ఉపాధి, ఉద్యోగాల్లో అన్ని తప్పుడు లెక్కలే
–టీడీపీ అంటే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ
–బడ్జెట్‌పై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగానికి అడ్డంకులు
–మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌
–అధికార పక్షం తీరుపై స్పీకర్‌ పోడియం వద్ద నిరసన

ఏపీ అసెంబ్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, ఖర్చులకు, కేటాయింపులకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని ఆరోపించారు. విద్యుత్‌ కొనుగోలులో స్కాం నెలకొందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్‌ లోటు లేదని, అలాంటి సమయంలో మన వద్ద ఉన్న విద్యుత్‌ను ఎవరు కొనుగోలు చేయరని తెలిపారు. ఏపీ బడ్జెట్‌పై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. 1953 నుంచి ఎంతో మంది మహనీయులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, సండ్ర రాజేశ్వరరావు ఈ సభను ప్రభావితం చేశారని గుర్తు చేశారు. మద్రాస్‌ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి అమరావతికి రాష్ట్ర పయాణం సాగిందని, ఇక్కడే స్థిరంగా ఉండాలని భావిస్తున్నాను అని అభిప్రాయపడ్డారు. వైయస్‌ జగన్‌ మా అందరికి గవర్నెన్స్‌ గురించి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మాకు సరైన ట్రైనింగ్‌ కల్పించడంతో ఇవాళ ఎన్నో రకాల అంశాలపై బడ్జెట్లో అర్థం చేసుకోగలిగాం. చిన్న వయస్సులో రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో పాల్గొనగలుతున్నాం. ఇది యువతకు ఆదర్శం కావాలని అభిప్రాయపడ్డారు.   కోర్‌ డ్యాష్‌ బోర్డును పరిశీలిస్తే. రూ.1.06120, అంటే దాదాపు రూ.24 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ రోజు మొత్తం ఖర్చు చూస్తే రూ.1.56 లక్షలు చూపుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ.3500 కోట్లు ఎక్షనలరీ ప్రాజెక్టు ఖర్చు కింద చూపుతున్నారు. మొత్తం రూ.6600 కోట్లు మనం లెక్కేస్తే..ఆ ఫిజికల్‌ డెప్సిట్‌ పెరిగిపోతుంది. నీటిపారుదల కేటాయింపులు గమనిస్తే..
62 శాతం వ్యవసాయంపై ఆధారపడ్డారు. కేవలం రూ.600కోట్లు మాత్రమే పెంచారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు సంబంధించి రూ.4110 కోట్లు కేటాయించాల్సి ఉంది. అంటే 1.1 శాతం కేటాయింపులు మాత్రమే చేశారు. ఎస్టీలకు సంబంధించి రూ.1800 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.1300 కోట్లు ఖర్చు చేశారు. మనం చట్టాలు చూసుకున్నాం. ఆ చట్టాల ప్రకారం కేటాయింపులు జరగలేదు. కొత్తగా మరేమైనా చట్టం చేశారా? అని నిలదీశారు. రాజేంద్రనాథ్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

–బడ్జెట్‌లో గతేడాది కన్నా 18 శాతం పెరిగింది.
– పన్నులు, రాబడి పది శాతం పెరిగింది.
–రూ.1700 కోట్లు రాజధాని నిర్మాణం కోసం కోటాయించారు.
–రూ.7 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు కేటాయించారు
–గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ.10 వేల కోట్లు చూపారు.
–ఈ మూడేళ్లలోనే రూ.1.25 లక్షల అప్పు పెరిగింది.
–అప్పు చేసేటప్పుడు ఎంత శాతం చేస్తున్నాం, దేని కోసం చేస్తున్నాం, దేని కోసం ఖర్చు చేస్తున్నారు.
– ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ట్రైబల్‌ వెల్పేర్‌ కింద కేటాయింపులు, ఖర్చులకు మధ్య వ్యత్యాసం ఉంది.
–ఇవన్నీ కేంద్రం నుంచి వస్తున్నట్లు స్పష్టమైన హామీ  ఉందా?
– కేటాయింపుల్లో చట్టాల ఉల్లంఘన జరుగుతోంది.
–జనాభా ప్రతిపాదికన  ఈ బడ్జెట్‌ చూస్తే రాబోయే రోజుల్లో విపరీతమైన లోటు ఏర్పడనుంది.
– రాష్ట్ర అప్పు రూ. 2 లక్షల 16 వేల కోట్లు,  మూడేళ్లలో లక్ష కోట్లకు పైగా పెరిగింది.
–అప్పు అన్నది చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాల్సిన అంశం, అనవసర ఖర్చులు, దుబారా ఖర్చులతో రేపు ఇబ్బంది పడేది రాష్ట్ర ప్రజలే.
–దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పవర్‌ డెప్సిట్‌ లేదు. మనమే పవర్‌ సర్‌ప్లస్‌లో ఉన్నామనుకుంటున్నాం. ఈ రోజు మన విద్యుత్‌ పక్కనే ఉన్న తెలంగాణకు అమ్ముదామనుకున్నా వారు కొనలేని పరిస్థితి ఉంది.
– ఈ రోజు బొగ్గు మిలియన్‌ టన్నులు నిల్వలు ఉన్నాయి. ఎందుకంటే దాని డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ రోజు ఉత్పత్తి ఉన్నా అందుకు తగ్గట్టు కొనే వారు లేరు. డిమాండ్‌ చాలా తక్కువుగా ఉంది. అన్ని రాష్ట్రాలకు పవర్‌ సమృద్ధిగా ఉంది.
– అభివృద్ధికి అందరికి నచ్చుతుంది. అయితే దానికి అయ్యే ఖర్చు ఎంత, దాన్ని ఎవరు భరించాలి.? ఆ భారం సామాన్య వినియోగదారుడిపై పడుతుంది.
– ప్రతి ఒక్క చోట కూడా ఏం చదువుకున్నామంటే అందరం గర్వంగా చెప్పుకుంటారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పీహెచ్‌డీ ఎస్వీ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి కాదు.
– రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2016–2017కు గాను 11.6 శాతం అని చెబుతున్నారు. 
–ప్రపంచ స్థూల ఉత్పత్తి 3 శాతం, దేశం స్థూల ఉత్పత్తి 7 శాతం ఉండగా, మనం ఇప్పుడు 11 శాతం సాధించామంటే మనమే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. ఇక 2050 వరకు వెయిట్‌ చేయాల్సిన పని లేదు కదా?
–ఒక్కరిని ఒక్కసారి ఫూల్‌ చేయవచ్చు. అందర్ని అన్నిసార్లు ఫూల్‌ చేయలేం.
–కీలుæగు్రరం కథను ఉదాహరణగా చెప్పారు.
–ఏదో విధంగా 2019 వరకు తప్పుడు లెక్కలతో నెట్టుకుపోవాలని టీyî పీ ప్రభుత్వం భావిస్తోంది.
–వ్యవసాయం 14 శాతం పెరిగిందని చెబుతున్నారు. మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి నెలకొంది.
–2014–2015లో 238, ఈ ఏడాది 359 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ ఈ రోజు అభివృద్ధి అంటు గొప్పలు చెప్పుకుంటున్నారు.
–రెయిన్‌గన్‌ స్టోరీ బహుబలి సినిమా కథలా ఉంది. వ్యవసాయ రంగంలో ఎలా అభివృద్ధి సాధించారో చెప్పాలి.
–విఫరీతంగా అడ్వర్‌టేజ్‌మెంట్లు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు.
–మార్చి 2016కే కేంద్రం నుంచి రూ.3 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తే..ఇంతవరకు రైతులకు చేరలేదు.
–పరిశ్రమల విషయానికి వస్తే..మే 2014కు గాను 183 పాయింట్లు మాత్రమే కనబరుస్తోంది. మనకు ఎక్కడా కూడా 5 శాతం కనిపించడం లేదు. పరిశ్రమలు పెరిగితే ఈ శాతం పెరగాలి కదా?
–ఫిషరీస్‌ గురించి రెండో పేజీలోనే రాశాను. ఇప్పుడు నుంచి చేప లెక్కలపై జాగ్రత్తగా ఉండాలి.
– వైజాగ్‌లో జరిగిన పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ గమనిస్తే అంతా బోగస్సే
– ఉపాధి, ఉద్యోగాల లెక్కలు అన్ని కూడా కాకి లెక్కలే. పేషెంట్ల లెక్కను ఎంప్లాయిమెంట్‌ కింద రాసుకున్నట్లుగా ఉంది.
–లేబర్‌ బ్యూరో రిపోర్టు, ప్రభుత్వం చెప్పే ఉద్యోగాల రిపోర్టు చూస్తే ట్యాలీ కావడం లేదు.
–ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని టీడీపీ నేతలు చిత్రీకరిస్తున్నారు.
–జీఎస్‌టీలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఎందుకు పన్ను రాయితీలు ఇస్తున్నారు.
–ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా పదిహేనేళ్లు కావాలని చెప్పిన నేతలు ఇప్పుడు మాట మార్చారు. ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని చెబుతున్నారు.
–ఏడాదికి మూడు కోట్లు ఇచ్చి  రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారు. ఇది వడ్డీకి కూడా సరిపోవడం లేదు.
– డ్వాక్రా రుణాలు కట్టే మహిళలను ఆపేశారు. తీరా ప్రభుత్వం కూడా కట్టకపోవడంతో మహిళలు అపరాధ వడ్డీలు కడుతున్నారు.
–ప్లాన్‌ అండ్‌ నాన్‌ ప్లాన్‌ చూస్తే..ఇది స్ట్రచరల్‌ రిఫార్మ్‌ అంటున్నారు. ఇందులో ఏముంది? భావితరాలకు అప్పుల భారం తగ్గుతుందట. ఇంగ్లీష్‌ పదాలు వాడి రకరకాలుగా చెబుతున్నారు.
–ఖర్చు చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాయి. పట్టిసీమకు రూ.1300 కోట్లు ఖర్చు చేశారు.  వెలగపూడి తాత్కాలిక సచివాలయం, పురుషోత్తపట్నం ఇలా అన్ని టెంపరరీనే. ప్రజలు వీరి చర్యలను అన్ని తాత్కాలికమే అని చర్చించుకుంటున్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని చెప్పుకుంటున్నారు.
Back to Top