ఇండ్ల మధ్య బ్రాందీ షాపులా..?

జమ్మలమడుగు: రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయాలను పెంచుకోనేందుకు ప్రజలు నివాసం ఉండే ఇండ్ల మధ్య మద్యంషాపులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని వైయస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో ఇండ్ల మధ్య బ్రాందీషాపులు పెట్టించడం కోసం మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడురాష్ట్రాన్ని అభివృధ్ది చేయడంలో పూర్తిగా విఫలమైపోయాడన్నారు. రాష్ట్రంలో ప్రజలు తాగటానికి మంచి నీరు దొరకడంలేదు గాని ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుందన్నారు. నాడు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి రామారావు చేపట్టిన సంక్షేమ పథకాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం పదిశాతం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. నాడు ఆయన మద్య నిషేధం విధిస్తే చంద్రబాబు నాయుడు తిరిగి మద్యంషాపులను విచ్చలవిడిగా తెరిపించి ప్రజలను మద్యం మత్తులో పడేవిధంగా చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల్లో మద్యం షాపులు వద్దని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పును ఇస్తే దానర్థం మద్యం షాపులను ఇండ్ల మధ్యపెట్టుకోవాలనా అన్ని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం ప్రజల సంక్షేమకోసం పాటుపడవలసిందిపోయి వారిని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే దిగువపట్నం కాలనీలో,మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామాల్లో ఇండ్ల మధ్య, ప్రార్థన మందిరాల వద్ద పెట్టడం సరైంది కాదని వెంటనే అధికారులు జోక్యం చేసుకోని మద్యంషాపులు పెట్టనివ్వకుండ చర్యలనుతీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో దొమ్మరనంద్యాల ఉప సర్పంచ్‌ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top