ప్రభుత్వ కుట్రలపై బ్రాహ్మణ సంఘం చర్చ

విజయవాడ: బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి, పార్టీ సీనియర్‌ నేత మల్లాది విష్ణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గం అణిచివేత ధోరణి, అర్చక వృత్తిపై జరుగుతున్న కుట్రలు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశానికి ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్, భువనేశ్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సత్యానంద భారతీ స్వామీజీ, సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. 
Back to Top