చంద్రబాబుది నిరంకుశ పాలన


 వైయస్‌ జగన్‌ను కలిసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు
పశ్చిమ గోదావరి: తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చంద్రబాబు నిరంకుశ పాలన  సాగిస్తున్నారని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. 
 ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఉండి నియోజకవర్గంలో సోమవారం బ్రహ్మణ సంఘం నేతలు తమ సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ విషయంలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి పవిత్రతను నేనే కాపాడానని చెప్పుకునే చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే టీటీడీ వివాదంపై ఎందుకు సీబీఐ విచారణ వేయించడం లేదని ప్రశ్నించారు. దేవాలయాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో జరిగిన తాంత్రిక పూజలపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 
 
Back to Top