టీడీపీ ఎమ్మెల్యే బోండాపై బ్రాహ్మణుల ఆగ్రహం

విజయవాడ:  టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీరును నిరసిస్తూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్థానిక మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.  జగన్మోహనరాజును బోండా ఉమ అరెస్టు చేయించారని ఈ సందర్భంగా ఆందోళన కారులు ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు చేయాలని నిలదీసినందుకే తమ నేతను అరెస్టు చేయించారని తెలిపారు.
 
బోండా ఉమ ప్రోద్బలంతోనే కార్పొరేషన్ సీఈవో అభిజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వారన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను జగన్మోహన రాజు జరిపిస్తున్నాడనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారన్నారు. జగన్మోహన రాజును వెంటనే విడుదల చేయకుంటే ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కృష్ఱారావు ఈ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Back to Top