అసమానతలు తొలగించిన మహానుభావుడు అంబేద్కర్‌

హైదరాబాద్‌: సామాజంలో అసమానతలు తొలగించి సమానత్వం పెంచేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్‌ 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతిని«ధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాసిరెడ్డి పద్మ, పద్మజ, పార్టీ సీనియర్‌ నేత లక్ష్మీపార్వతి, చల్లా మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని ఆలోచన చేశారన్నారు. మహిళల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు రూపొందించారన్నారు. రాజ్యాంగాన్ని కించపరిచే వ్యక్తి చంద్రబాబుకు అంబేద్కర్‌ జయంతి నిర్వహించే హక్కు లేదన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అందులో నలుగురిని మంత్రులను చేసిన చంద్రబాబుకు అంబేద్కర్‌ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు. 
 
Back to Top