మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని నాశనం చేశారు

పశ్చిమ గోదావరి(దేవరపల్లి) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వీధి పోరాటాలకు సిద్ధమని  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. దేవరపల్లి మండలం త్యాజంపూడిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ధ్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, రెండు కళ్ల సిద్ధాంతం వల్ల రాష్ట్రం నాశనమైందన్నారు. మహిళలను దారుణంగా కించపర్చే ఉపమానాలతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.

Back to Top