ప్యాకేజీలు మాకొద్దు, ప్ర‌త్యేక హోదా కావాల్సిందే


హైద‌రాబాద్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా కావాల్సిందే అని మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్సా స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. ప్యాకేజీలు వంటి మాట‌లు వ‌ద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌లో ఒక ర‌కంగా మాట్లాడి ప్ర‌జ‌ల్లో గంద‌ర గోళం సృష్టిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి తామేదో సాధించిన‌ట్లుగా తెలుగుదేశం నాయ‌కులు ప్ర‌చారం చేసుకొంటున్నార‌ని, వాస్త‌వానికి వాళ్లు చేస్తున్న‌దంటా గిమ్మిక్కుల‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు చేస్తున్న కుట్ర‌లు అని ఆయ‌న అభివ‌ర్ణించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top