ఆ టీమ్‌కు లోకేషే రాకుమారుడు-మాజీ మంత్రి బొత్స

గుంటూరు: దోపిడిదారుల కుమారుల టీమ్‌కు లోకేషే రాకుమారుడని మాజీ మంత్రి, వైయ‌స్సార్సీపీ  సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టమన్నారు. బాబు హామీల అమలు కోసం జూన్ 2న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదావర్తి సత్రం భూముల వేలంను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ భూముల వేలంలో రూ.వెయ్యి కోట్లు దోచుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టాలన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కేంద్రానికి రాసిన లేఖల వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. జూన్ 2న చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బొత్స పిలుపునిచ్చారు.
Back to Top