పంచ‌భూతాల‌ను పంచుకుతినేస్తున్నారు

  • పార్టీ మార‌ాక ఒక్క అభివృద్ధి ప‌నైనా చేశావా సుజ‌య‌కృష్ణ‌
  • ల‌క్ష‌ల ఇళ్లు క‌ట్టించామ‌ని టీడీపీ గొప్ప‌లు
  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
విజ‌య‌న‌గ‌రం: తెలుగుదేశం పార్టీ నేత‌లు పంచ‌భూతాల‌ను పంచుకుతినేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిపడ్డారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క అభివృద్ధి కార్య‌క్ర‌మానికి కూడా శంకుస్థాపన చేయ‌లేక‌పోయాడ‌ని విమ‌ర్శించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లిలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి బొత్స స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ వైయ‌స్ఆర్ కుటుంబంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్రంలో లక్ష ఇళ్లు కట్టించామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే తన హయాంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే 2.8 లక్షల ఇళ్లు కట్టించానని గుర్తు చేశారు. దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అమలయ్యే సంక్షేమ పథకాలు పక్కగా అమలు కావాలంటే ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. ప్ర‌జ‌లంద‌రికీ మ‌ళ్లీ రాజ‌న్న సువ‌ర్ణ ప‌రిపాల‌న అందించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ నవరత్నాలు పథకాలతో మీ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. 

తెలుగుదేశం నేతలు మాదిరిగా మాయమాటలు చెప్పడం తమకు చేతకాదని, ఓట్లు వేసి గెలిపించే ప్రజలకు అభివృద్ధి పనులు చేయడమే తమ బాధ్యతగా భావిస్తామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. రహదారులు, తాగునీటి పథకాలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, టీటీడీ కల్యాణ మండ‌పం, సెంటర్‌ లైటింగ్, అమ్మవారి ఆలయం అభివృద్ధి, తదితర పనులెన్నో బొత్స  సత్యనారాయణ హయాంలో జరిగాయన్నారు. మూడున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తూనే వస్తోందని.. 2019లో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇస్తే సంక్షేమ పరిపాలన అందుతుందని చెప్పారు. 
Back to Top