పాలనను గాలికొదిలేసి.. ప్రతిపక్షంపై విమర్శలా?

 

 విశాఖపట్నం: చ‌ంద్ర‌బాబు పాలనను గాలికొదిలేసి.. ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నార‌ని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు.  ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో బిహార్‌ను మించిపోయిందని.. ఏపీలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు పెరిగిపోయాయని అన్నారు. విశాఖ‌లో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని బొత్స నిలదీశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజనిర్ధారణకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు. ఎయిర్‌ ఏషియా స్కామ్‌లో కేంద్రాన్ని విచారణ కోరగలరా అని బొత్స ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ. లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక, మద్యం మాఫియాను రాష్ట్రంలో పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకుండా రోడ్డుపైకి తెచ్చారని ప్రభుత్వంపై బొత్స సత్య సత్యనారాయణ ధ్వజమెత్తారు.
 


Back to Top