రైతులంటే బాబుకి కక్ష

 • ఇదే
  చివ‌రి అధికారం అన్న ధోర‌ణిలో బాబు పాల‌న‌
 • భూములపై అక్రమ విధానం
 • మండిపడ్డ మాజీమంత్రి బొత్స స‌త్య‌నారాయణ‌
 • హైదరాబాద్: అధికారంలోకి రాగానే పేద‌ల‌కు మూడు సెంట్ల భూమిని కేటాయించి... ప్ర‌భుత్వ‌మే
  ఇళ్ల‌ను నిర్మించి ఇస్తుంద‌న్న చంద్ర‌బాబు... ఇప్పుడు ఎందుకు అక్ర‌మంగా భూముల‌ను లాక్కుంటున్నార‌ని
  మాజీమంత్రి, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ
  అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
  చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌వుతున్న మూడు సెంట్ల భూమి కాదుక‌దా...
  సెంటిమీట‌రు భూమిని కేటాయించ‌లేద‌ని మండిప‌డ్డారు. పార్టీ కార్యాల‌యాల కోసం టీడీపీ
  కేటాయిస్తున్న భూమి రాజ‌కీయ పార్టీల‌కు కాకుండా టీడీపీ పార్టీల‌కు కేటాయించిన‌ట్లు
  ఉంద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. బొత్స ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

   

  *
  ప్ర‌జాస్వామ్యంలో
  ప్ర‌జ‌ల‌ చేత ఎన్నికైన ప్ర‌భుత్వాలు త‌మ‌కు ఎటువంటి విధానాలు తీసుకొస్తార‌ని, త‌మ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తార‌ని
  ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. 

  *
  బాబు ప్ర‌భుత్వం
  మాత్రం అభివృధ్ధిని ప‌క్క‌న పెట్టి దోపిడీకి పాల్ప‌డుతోంది.  రాజ‌ధాని మొద‌లుకొని జిల్లాస్థాయిల వర‌కు విలువైన భూముల‌ను ఎలా కేటాయిస్తారు.

  *
  పేద‌ల‌కు
  భూములిచ్చామ‌ని ప‌దేప‌దే చెప్పుకునే టీడీపీ నాయ‌కులు ఎక్క‌డ ఇచ్చారో చూపించాలి.  పార్టీల‌కు కేటాయించే భూముల‌ను సైతం అసెంబ్లీలో ఉన్న సీట్ల లెక్కింపుతో అని
  చెప్ప‌డం సిగ్గు చేటు.

  *
  కేంద్రం, రాష్ట్రంలో ఎన్నో ప్ర‌భుత్వాలు అధికారంలోకి వ‌చ్చాయి...
  కానీ ఇలా సీట్ల ప్ర‌తిపాదిక‌న భూములు కేటాయించ‌డం ఏ పార్టీ అమ‌లు చేయ‌లేదు.

  *
  ప్ర‌ధాన ర‌హ‌దారులు, కూడ‌ళ్లు, విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను తెలుగుత‌మ్ముళ్లు
  దోచుకోవ‌డానికి కుట్ర‌

  *
  ఈ భూ కేటాయింపుల‌ను
  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. 

  *
  ఒక‌సారి అధికారం
  వ‌చ్చింది క‌దా అని అధికారం, రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి దోపిడీకు పాల్ప‌డ‌డం స‌మంజ‌సం కాదు

  *
  2004 ఉమ్మ‌డి
  రాష్ట్రంలో టీడీపీకి కేవ‌లం 47 స్థానాలున్నాయి... అంటే 1/6 వంతు... అలాంట‌ప్పుడు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ ఏం చేయాలో బాబు చెప్పాలి

  *
  టీడీపీ ప్ర‌తిప‌క్షంలో
  ఉన్న‌ప్పుడు  అధికార ప్ర‌భుత్వం బంద‌ర్‌పోర్ట్
  నిర్మిస్తామంటే వెయ్యి ఎక‌రాలు చాల‌న్నారు. నేడు ల‌క్ష ఎక‌రాలు కావాల‌ని నోటిఫికేష‌న్
  ఇస్తున్నారు... తిరిగి ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తే 25,000 ఎక‌రాలు చాలంటున్నారు

  *
  చంద్ర‌బాబు... ఎందుకు
  పేద‌వాడి మీద నీకు అంతటి కక్ష. రైతుల మీద ఎందుకంత ద్వేషం...

  *
  పార్టీల కోసం భూ
  కేటాయింపులపై ప్ర‌జాతిరుగుబాటు రాబోతోంది... 

  *
  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ
  వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు టీడీపీకి ఓటు వేసి మేము మోస‌పోయామ‌ని
  చెబుతున్నారు.. ద‌గా ప‌డ్డాం.. వంచ‌న‌కు గుర‌య్యామ‌ని వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల‌తో
  మొర‌పెట్టుకుంటున్నారు. 

   

  రాజ‌న్న ఉన్న కాలంలో రైతే రాజుగా....

  *
  దివంగ‌త మ‌హానేత
  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హాయంలో రాష్ట్రంలోని ఏ మారుమూల గ్రామ ప్ర‌జ‌లు, వృద్దులకు ఎటువంటి క‌ష్టం వ‌చ్చిన మాకు వైయ‌స్సార్
  ప్ర‌భుత్వం అండ ఉంద‌ని గుండెపై చెయ్యి వేసుకుని ప‌డుకునేవారు...

  *
  న‌మ్మ‌కానికి
  మారుపేరుగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని
  చెప్పుకునే వారు...

  *
  రైతుల‌కు ఉచిత
  విద్యుత్,
  రుణమాఫీ, రైతుకు ఏ క‌ష్టం వ‌చ్చిన రాజ‌న్న ఉన్న‌డ‌న్న
  ధీమాతో ప్ర‌తి రైతు తానొక రాజు అన్న భావ‌న‌తో పంట‌ల‌ను సాగు చేసేవాడు...

  *
  ఇటు మ‌హిళ‌లు
  సైతం పావలా వ‌డ్డీ రుణాలు తీసుకొని ఎంతో సంతోషంగా ఉండేవారు.. 

  *
  కానీ ప్ర‌స్తుత
  చంద్ర‌బాబు పాల‌న‌లో ఉద‌యం లేచింది మొద‌లు స‌ద‌రు రైతు నా భూమి నాకు ఉంటుందా...? అన్న అనుమానంతో బ్ర‌తకాల్సిన దుస్థితి నెల‌కొంది.

  *
  బాబు పాల‌న వ‌ల్ల
  ప‌ల్లెలు,
  ప‌ట్ట‌ణాల్లో భ‌యంక‌ర‌మైన
  వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

  *
  మొన్న స‌దావ‌ర్తి
  భూములు... నేడు పార్టీల కోసం భూములు... ఇలా అనేక విధాలుగా భూ అవినీతికి పాల్ప‌డుతారు.

  *
  ఒక‌సారి ఓటు
  వేసినందుకు ఈ విధంగా దోపిడికి పాల్ప‌డ‌డం దారుణం.. ఇదేనా ఒక ముఖ్య‌మంత్రి ప‌రిపాల‌న
  విధానం...

  *
  త‌మ‌కు ఇదే చివ‌రి
  అధికారం అని భావించే బాబు
  ఇలాంటి ద్వంద్వ వైఖరికి పాల్ప‌డుతున్నారు. 

   

తాజా ఫోటోలు

Back to Top