పంచభూతాలను పంచుకు తింటున్నారు

తాడేపల్లిగూడెం: టీడీపీ నేతలు పంచభూతాలను కూడా పంచుకుని తింటున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసెంబ్లీ భవనంలో వర్షపు నీరు లీకైతే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, శాంతిభద్రతలు అదుపులో లేవని ధ్వజమెత్తారు. బయటకు వెళ్లినవారు క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక నగరంగా అభివృద్ధి చేస్తామన్న విశాఖను భూకబ్జాలమయంగా మార్చేశారని తెలిపారు. ప్రత్యేకహోదాను సైతం నీరుగార్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు.

అధికారంలోకి రావడానికి చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఆళ్ల నాని తెలిపారు. 600లకుపైగా హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చని ఘనత చంద్రబాబుదే అన్నారు. ఓటుకు కోట్లు కేసు వల్లే ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆరోపించారు.

Back to Top