విద్రోహ శక్తులుగా చూస్తారా..?

హైదరాబాద్ః చంద్రబాబు కాపు సామాజిక వర్గాన్ని విద్రోహ శక్తులుగా చూస్తున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సున్నితమైన అంశాన్ని జఠిలం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఓ పక్క ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తుంటే....ఆయన ఆరోగ్యం బాగుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ప్రతీ దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని, అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ముద్రగడ ఆరోగ్యం విషయంలో మంత్రులు, అధికారులు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top