ట‌క్కు, ట‌మార విద్య‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు

 

 విజయనగరం : నాలుగేళ్ల తెలుగుదేశం పాలనలో టక్కు, టమార విద్యలతో ప్రజలను మభ్యపెట్టి దుర్మార్గ పరిపాలన సాగిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని గాడి తప్పిన వ్యవస్థను సరి చేసేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఎంతైనా అవసరమని  అన్నారు. గుర్ల మండల బూత్‌ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు.  గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయాలంటే కచ్చితంగా 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందాలని సూచించారు. 2019లో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే హయాంలో నిష్పక్ష పాలన, చట్టానికి లోబడి, న్యాయబద్దంగా పరిపాలన అందించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీరు, మట్టిని కూడా అమ్ముకుని దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మిగిలిన కొద్ది నెలల్లో కూడా ఇష్టారాజ్యంగా దోపిడి చేసి రాబోయే ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు.  పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు బూత్‌ కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. బూత్‌ కమిటీలు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top