అక్రమ ప్రాజెక్ట్ లపై మౌనమేల బాబు

విశాఖపట్నంః చంద్రబాబు ఏపీ ప్రయోజనాల్ని పక్కరాష్ట్రాలకు తాకట్టుపెడుతున్నారని  వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ లపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని  వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని అధికార టీడీపీని నిలదీశారు. శ్రీశైలం జలాశయంలో 800 అడుగులుండగానే తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడుకుంటే దిగువ ప్రాంతాలకు నీరు ఎలా వస్తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏపీలోని పలు జిల్లాలు ఎడారిగా మారుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తోందని ఆగ్రహించారు.  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తయితే దిగువన నీటిమట్టం తగ్గుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టకపోతే పరిస్థితి ఏంటని, ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు. పోలవరాన్ని తామే పూర్తిచేస్తామంటూ కేంద్రం ముందుకొచ్చినా...బాబు దాన్ని పక్కనపెట్టి ధనదాహం కోసంపట్టిసీమను తీసుకొచ్చారని టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 

To read this article in English:  http://bit.ly/1R0NbMw 

Back to Top