సీమాంధ్రను స్కాం ఆంధ్రగా మార్చాడు

బినామీ వ్యాపారాల కోసమే భూ దోపిడీ
సింగపూర్ కు భూముల ధారదత్తంపై బొత్స ఫైర్
ప్రభుత్వ సంస్థ లేక ప్రైవేటు వ్యాపార సంస్థ అంటూ ఆగ్రహం
18 నెలల్లో వేల కోట్ల కుంభకోణాలు
సిగ్గేయడం లేదా చంద్రబాబుఃబొత్స

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొద్దున లేచిన దగ్గర్నుంచి ఏదో ఓ స్కాం చేస్తూ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో చంద్రబాబు భారీ కుంభకోణాలకు  పాల్పడుతూ....సీమాంధ్ర రాష్ట్రాన్ని స్కాం ఆంధ్ర రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. సింగపూర్ ప్రభుత్వం పేరుతో అక్కడి కంపెనీలకు ఏ ప్రాతిపదికన వేలాది ఎకరాలు కట్టబెడుతున్నారని బొత్స  చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని భూములన్నీ తమకు ధారాదత్తం చేయాలి, లీజుకివ్వాలని సింగపూర్ వాళ్లు అడుగుతున్నారంటే..ఇది ప్రభుత్వమా లేక ప్రైవేటు వ్యాపార సంస్థ అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారని నిప్పులు చెరిగారు. 

తమ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్  ప్రజలకు ఆమోదమైన రాజధాని కట్టాలని ముందు నుంచి చెబుతున్నారని బొత్స అన్నారు. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా రాజధాని ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా అరచేతిలో వైకుంఠం చూపెడుతూ చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సింగపూర్ ప్రభుత్వం సహాయసాకారాలతో నాకున్న పరిచయాలతో నేను ఈకార్యక్రమం చేస్తున్నానని డాబులు పలుకుతూ అక్కడి కంపెనీలకు దోచిపెడుతుంది వాస్తవం కాదా అని నిలదీశారు.  చంద్రబాబు సింగపూర్ లోని తన బినామీ వ్యాపారాల కోసమే రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు. 

పంచభూతాలు.. నీరు, ఇసుక, మట్టి, గాలి, ఆకాశం ఏది విడిచిపెట్టకుండా కబళించేస్తున్నారని బొత్స ఫైరయ్యారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి ఆంధ్ర ప్రజానీకమంతూ గుర్తించాలన్నారు. నీరు-చెట్టు పేరుతో మట్టి దోపిడీ, జీవో 22 తీసుకొచ్చి పట్టిసీమలో దోపిడీకి పాల్పడ్డారు. పుష్కరాల్లో 1600 కోట్ల రూపాయలు దోపిడీ, బొగ్గులో దోపిడీ, ఇసుకలో దోపిడీ ఇలా ప్రతిదాంట్లో ఏం చేస్తే లాభం వస్తుంది, ఎవరికి దోచిపెడదాం అన్న చందాన చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రకరకాల మాటలు చెబుతూ పోలవరాన్ని పూర్తిగా పక్కనబెట్టారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను మింగేశారు. కరవుతో నీళ్లు లేక అల్లాడుతుంటే కృష్ణాడెల్టాకు నీరిచ్చినంటూ చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.   హామీలు నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే...దోచుకునేందుకు నీకు మనసెలా వస్తుంది, సిగ్గేయడం లేదా చంద్రబాబు అంటూ బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

విజయవాడలో ముఖ్యమంత్రి నివాసం  భవనం పక్కన కల్తీమద్యం తాగి ఐదుగురు చనిపోతే చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని బొత్స విమర్శించారు. చంద్రబాబు ముడుపులు తీసుకొని మద్యం మాఫియాను నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. రుణాలు మాఫీ కాక వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో మహిళలు ఉంటే...వాళ్ల  మంగళసూత్రాలతో ఆటలాడుతున్నావ్ సిగ్గేయడం లేదా చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చనిపోయిన వారి కుటుంబాల ఆవేదన చూసి వైఎస్ జగన్ మద్యపాన నిషేధం నిర్ణయం తీసుకుంటే  అవాకులు,చెవాకులు పేలుతున్నారని విరుచుకుపడ్డారు. మద్యంపై  వైఎస్సార్సీపీ విధానమేంటో తెలియజేశాం. మీ వైఖరేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని బొత్స సూటిగా ప్రశ్నించారు. ప్రజాశ్రేయస్సు కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడాలని డిమాండ్ చేశారు. 
Back to Top