బాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు

()బాబు హయాంలో రాజ్యమేలుతోన్న అవినీతి
()విదేశీ కంపెనీల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతున్నారు
()ఎంతమంది రైతులు నష్టపోతే బాబు ధనదాహం తీరుతుందో..?
()పోలవరంపై పొరుగు రాష్ట్రాలకు ఏం సమాధానం చెబుతారు..?
() విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ

హైదరాబాద్ః చట్టాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు వద్దని చెప్పినా వినకుండా స్విస్‌ చాలెంజ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్డిగా ముందుకెళ్లడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ హితబోధ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు, లోకేశ్‌ల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. విదేశీ కంపెనీల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలికారు. అధికారం ఉందని ఇష్టానుసారం చట్టాలు చేస్తే చాలదని రాజ్యాంగానికి లోబడి ఉండాలన్న సంగతి మాత్రం  మరిచిపోరాదన్నారు. ఇంకా ఎంత మంది రైతులు నష్టపోతే  చంద్రబాబు ధనదాహం తీరుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. చినబాబు, పెదబాబు రాష్ట్రాన్ని దోచుకోవడమే ధ్యేయంగా తీవ్రంగా శ్రమిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 

వ్యవసాయం మంత్రి ఇలాకాలో నకిలీ విత్తనాలు
సాక్ష్యాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో నకిలీ విత్తనాలతో పంటలు నష్టపోయి రైతులు అల్లాడిపోతుంటే ఆయన చోద్యం చూడటం తప్ప చేసిందేమీ లేదన్నారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటేనే రైతులపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొలాల మీద, గ్రామాల మీద పడుతుంటే ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం చూస్తుంటే ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పథకాలన్నీ స్తంభించిపోయాయని ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఎన్ని గృహాలు మంజూరు చేశారో లెక్కచెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిన ఇళ్లు అక్కడ్నుంచి ముందుకు కదిలిన పరిస్థితి లేదన్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంవత్సరానికి పది నుంచి పన్నెండు లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు.

‘పోలవరం’ను ఏం చేయబోతున్నారు
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంను తామే పూర్తిచేస్తామని చంద్రబాబు ఎందుకు తీసుకొచ్చినట్టో ప్రజలకు తెలియాలన్నారు. కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడి పోలవరం తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న పొరుగు రాష్ట్రాలు చత్తీస్‌ఘడ్, ఒరిస్సాలకు ఏం సమాధానం చెబుతారో చూడాలన్నారు. అదే ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉండుంటే కేంద్రమే అన్నీ తానై చూసుకునేదన్నారు. పర్యావరణ అనుమతులు, పునరావాసం, భూసేకరణ, రైతులకు నష్ట పరిహారం తదితర అంశాలపై... సుప్రీం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నోటీసులకు ఏం సమాధానం చెబుతారో, ప్రాజెక్టును ఎన్నాళ్లకు పూర్తిచేస్తారో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదన్నారు. రుణమాఫీ చేయకుండా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రిని చంద్రబాబునే చూస్తున్నానని అన్నారు. ఈయన రుణ మాఫీ చేయకుండా ఆర్‌బీఐ మీదకు నెట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. రైతుల రుణాలు చెల్లించి ఉంటే బ్యాంకులు తిరిగి అప్పులిస్తాయి గానీ... రుణాలు చెల్లించకుండా బ్యాంకులపై నెపం మోపడం సరికాదన్నారు. తాను విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుంటే దాదాపు వెయ్యి ఇసుక లారీలు ఆపి ఉండటం చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. ఆ ఇసుకంతా అడ్డదారిన టీడీపీ నాయకుల అండతో హైదరాబాద్‌కు తరలిస్తుండటం చూస్తేనే రాష్ట్రంలో ఇసుక మాఫీయా ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందన్నారు. 

పాపం.. చినరాజప్ప
వడ్డీశ్వరంలోని కేఎల్‌సీలో జరిగిన టీడీపీ శిక్షణ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పట్ల లోకేశ్‌ వ్యవహరించిన తీరుపై బొత్స మండిపడ్డారు. చినరాజప్ప పదవికి గౌరవం ఇవ్వకపోయినా కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వకుండా ఆయన మాట్లాడిన తీరును బొత్స తప్పుబట్టారు. శిక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత లోకేశ్‌ వ్యవహారం పట్ల చినరాజప్ప సన్నిహితుల వద్ద కన్నీరు పెట్టుకున్న సంగతి సోషల్‌ మీడియాలో ఇప్పుడు హాట్‌ టాపిగ్‌గా మారిన సంగతి తెలిసిందే. వయసులో పెద్దవాడైన ఒక ఉప ముఖ్యమంత్రినే గౌరవించలేని సాంప్రదాయం లేని పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడతారని బొత్స ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ ఫొటోను చూస్తుంటేనే ఆయనెంతగా వణికిపోతున్నారో కనిపిస్తుందన్నారు. వ్యవస్థను గౌరవించాలని హితవు పలికారు. చినరాజప్పను ప్రశ్నించడానికి ఆయనేమైనా పార్టీ అధ్యక్షుడా అని ప్రశ్నించారు. తాను పదేళ్లు మంత్రిగా పనిచేసినా ఇలాంటి అనుభవాలు ఎక్కడా ఎదురుకాలేదన్నారు. 

తాజా వీడియోలు

Back to Top