ఇద్దరూ తోడు దొంగలు

తిరుపతి : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుళ్లిద్దరూ తోడు దొంగలని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... బాబు పాలనతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి చంద్రబాబును రక్షించినందుకే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు రాష్ట్రంలో సన్మానాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, వెంకయ్యలిద్దరూ గోబెల్స్ ను మించిన ఘనులని ఆయన ఎద్దేవా చేశారు. 
Back to Top