బాబూ..ప్రధానితో ఏ అంశాలపై చర్చించారు


హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో ఏ అంశాలపై చర్చించారో వెల్లడించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 20 అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన భేటీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పాలన్నారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏం సాధించారని నిలదీశారు.
 
Back to Top