పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

సాలూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.  రామాకాలనీలోని అభయాంజనేయస్వామి ఆలయంలో వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్‌ వేగేసిన నాగరాజు(బుల్లెట్‌రాజు) పలువురు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను అందజేశారు.  ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలన్న ఆకాంక్షతో భీష్మ ఏకాదశి రోజున ఆలయ అర్చకుడు రామ్‌శరణ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపామన్నారు.

Back to Top