వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల బాంబు దాడి

బెల్లంకొండ(గుంటూరు): జిల్లాలో ఓ టీడీపీ నేత హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న 18 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై గురువారం సాయంత్రం బాంబు దాడి జరిగింది. టీడీపీ నేత సింగిరెడ్డి వెంకటరమణారెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులు సత్తెనపల్లి కోర్టులో హాజరై తిరిగి వస్తుండగా బెల్లంకొండ మండలం పాపాయిపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో వారి  వాహనంపై టీడీపీ వర్గీయులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మాజీ జెడ్పీటీసీ మర్రి అచ్చిరెడ్డి (56)తో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 


Back to Top