హైకోర్టులో బాబు సర్కార్ కు చుక్కెదురు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లొసుగులున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Back to Top