వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం

గుంటూరుః ప్రజానేత డా. వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వస్తువులు, పండ్ల పంపిణీ, అన్నదానం, రక్తదానం సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో డా. నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 70 బ్లడ్ ప్యాకెట్స్ ను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కు అందించారు. 
Back to Top