ఏదో ఒక సాకుతో చర్చకు అడ్డుపడుతున్న బిజెపి- ఎంపి వరప్రసాద్ విమర్శ

న్యూఢిల్లీ: 

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేయడంతోపాటు, అమరణ నిరాహార దీక్ష చేపట్టాలని పార్లమెంటు సభ్యులు నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో మొదటి సారి అని వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపి వరప్రసాద్ అన్నారు. లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా, ఏదో ఒక సాకు చూపుతూ సభను వాయిదా వేయాలని చూస్తున్నారని ఇది ఎంతమాత్రం తదగన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చచేపట్టడానికి అవసరమైన ఎంపిల మద్దతు ఉన్నప్పటికీ చర్చ నుంచి తప్పించుకోడానికి బిజెపి చూస్తున్నందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు ఢిల్లీ జపం చేస్తున్నారన్నారు. లాలూచీ కోసమే ఆయన ఢిల్లీ పర్యటనకు వస్తున్నారని, టిడిపి అసమర్థత వల్లే ,కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.  గడచిన 4 ఏళ్లుగా ప్రజలను ఇదే విధంగా మోసం చేస్తూ చంద్రబాబు తన పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు.

Back to Top