బీజేపీ, టీడీపీలకు అదే గతి

న్యూఢిల్లీ)) ఆంధ్రప్రదేశ్ లో గతంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీ,
టీడీపీలకు పట్టడం ఖాయమని వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయ పడ్డారు. రాజ్యసభ
లో ప్రత్యేకహోదా మీద ప్రైవేటు మెంబర్ బిల్లుని బీజేపీ, టీడీపీలు పక్కదారి పట్టించిన తర్వాత
పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్త శుద్ధి లేదన్న సంగతి అర్థం అవుతోందని చెప్పారు. ఈ
బిల్లు ఆమోదం పొందకుండా సాంకేతిక కారణాలు సాకుగా చూపించి పక్కదారి పట్టించారని
ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ కి విభజన తో కాంగ్రెస్ చేసిన అన్యాయానికి
ప్రజలు బుద్ధి చెప్పారని వివరించారు. అదే గతి బీజేపీ, టీడీపీలకు పడుతుందని
విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

Back to Top