బీజేపీ..టీడీపీలు మోసం చేశాయి

అమరావతి: రాష్ట్రానికి బీజేపీ, టీడీపీలు కలిసి మోసం చేశాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రజాదరణ మరో నేతకు లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు కోసం టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. ఆ డబ్బంతా మనదే..ఇస్తే తీసుకోండి..మీకు ఇష్టం వచ్చిన వారికి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీని బీజేపీ మోసం చేసిందని చంద్రబాబు అంటున్నారని, కానీ బీజేపీ, టీడీపీ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని చెప్పిన చంద్రబాబు వైయస్‌ జగన్‌ దెబ్బతో మళ్లీ హోదా వైపు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Back to Top