అమ్మ ఒడిలో చేరిన అనుభూతి కలిగింది


– బీజేపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీ చేరిక
 తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. మంగళవారం బీజేపీకి చెందిన పలువురు నాయకులు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. రాయవరం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకట్రావు, బోకం శ్రీనివాస్, పలువురు సర్పంచ్‌లు చేరారు. వైయస్‌ జగన్‌లో ఉండే ఆత్మవిశ్వాసమే పార్టీలో చేరేలా చేసిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో చేరడం అమ్మ ఒడిలో చేరిన అనుభూతి కలిగిందని అభిప్రాయపడ్డారు. పాలనలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. రాజన్న పాలన వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
Back to Top