షర్మిలమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

హైదరాబాద్)మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి షర్మిలకు పుట్టిన రోజు అభినందనలు వెల్లువెత్తాయి. షర్మిల పుట్టిన రోజును పురస్కరించుకొని పెద్ద ఎత్తున వైయస్సార్సీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 

ఖమ్మంలో షర్మిల పుట్టిన రోజు సందర్భంగా వైయస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ తీశాయి. బాణసంచా కాల్చారు. కేక్ కట్ చేశారు. పేదలకు దుస్తులు, పాలు, పండ్లు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, లక్కినేని సుధీర్ తదితర నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో వైయస్సార్సీపీ నేతలు షర్మిల బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదానం చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు విదేశాల్లోనూ  షర్మిల బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. 
Back to Top