ఘనంగా విజయమ్మ జన్మదినోత్సవం

నక్కపల్లి(పాయకరావుపేట): వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్ విజయమ్మ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం పాయకరావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఎల్‌టీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ, మండలపార్టీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ అల్లాడ శివకుమార్, పార్టీ సీనియర్‌నాయకులు బీవీరమణ, ఆడారి ప్రసాద్, లంక సూరిబాబు, ముప్పిన శ్రీను, కె.రామకృష్ణ, ధర్మాజీ, అల్లక శ్రీను, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top