అనాథాశ్రమంలో ఎంపీ బుట్టా రేణుక జన్మదిన వేడుకలు

 కర్నూలు: వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక
జన్మదిన వేడుకలు పత్తికొండ పట్టణంలోని అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు.
 వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధానకార్యదర్శి మేడం కృష్ణమూర్తి
ఆధ్వర్యంలో నాయకులు,
న్యాయవాదులు
వృద్ధులకు పండ్లు,
బ్రెడ్డు పంపిణీ
చేశారు. ఈ సందర్భంగా క్రిష్ణమూర్తి మాట్లాడుతూ....ఎంపీ బుట్టారేణుక తన రెండేళ్ల
పదవీకాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని
నియోజకవర్గాలలో పర్యటిస్తూ,
కార్యకర్తలకు, నాయకులు అందుబాటులో ఉంటున్న బుట్టా రేణుక
భవిష్యత్తులో మరిన్ని ఉన్నతపదవులు అలంకరించి, పేద ప్రజలకు సేవలు అందిస్తారని ఆశాభావం
వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు బండా నరసింహులు, బురుజుల భరత్‌సింహారెడ్డి, బార్‌అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు నరసింహయ్య, న్యాయవాదులు మాచాని సోమప్ప, బీటీ నాగలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Back to Top