ఆందోళన మధ్యే బిల్లుల ఆమోదం

ఏపీ అసెంబ్లీ: శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ప్రభుత్వం బిల్లులకు ఆమోదం పొందించి. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీపై సభలో చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు పట్టుబట్టగా ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌ను లెక్క చేయకుండా ప్రభుత్వం ఆందోళన మధ్యే  బిల్లులు ప్రవేశపెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లుకు అధికార పక్షం ఆమోదం తెలుపగా, ఆ తరువాత రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించి విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న మంత్రులు గంటా, నారాయణలను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Back to Top