గర్జన దీక్షకు మద్ధతుగా అనంతలో బైక్ ర్యాలీ

అనంతపురం ఆర్ట్ కళాశాల మైదానంలో వైయస్ ఆర్ కాంగ్రెస్
పార్టీ సోమవారం తలపెట్టిన వంచన పై గర్జన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
కోరుతూ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బైక్
ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది యువత ఉత్సాహంగా పాల్గొని రాష్ట్రానికి
చంద్రబాబు, బిజెపి లు చేస్తున్న మోసంపై గళమెత్తి నినదిస్తూ, దీక్షను విజయవంతం చేయాలంటూ
ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Back to Top