ప్రత్యేకహోదా వచ్చేదాక పోరాటం

విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకూ వైయస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని  ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకహోదా సాధనకోసం ప్రజల్ని చైతన్యం చేసేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాల్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో భారీ బహిరంగసభలను త్వరలో ఏర్పాటు చేయనున్నారని ఆయన వెల్లడించారు.

విశాఖలోని వైయస్సార్‌సీపీ నగర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హోదాకంటే ప్యాకేజీయే మిన్నంటూ  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నిజానికి ప్యాకేజీ అనేమాట సెప్టెంబర్ 7న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో లేనేలేదన్నారు. ప్రత్యేకహోదా అంశంపై బహిరంగచర్చకు రావాలని ప్రభుత్వానికి సవాలు విసిరారు.

Back to Top