విభజన పాపం టీడీపీదే: జోగి రమేష్

విజయవాడ 07 ఆగస్టు 2013:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి ముమ్యాటికీ  టీడీపీనే కారణమని వైయస్ఆర్ కాంగ్రెస్ నేత జోగి రమేష్ స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చీడపురుగులని ఆయన మండిపడ్డారు.  టీడీపీ ఎమ్మెల్యేలు పొలిట్‌బ్యూరోలో అనుకూలంగా తీర్మానం చేశారన్నారు.  ఆ లేఖ ఇచ్చినపుడు టీడీపీ నేతలు నిద్రపోయారా అని ఆయన ప్రశ్నించారు. రాజీనామాలు చేశామంటున్న కాంగ్రెస్ నేతలు అధికారాన్ని వాడుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తాజా ఫోటోలు

Back to Top