విభజన పాపం సోనియా గాంధీదే

తాడిపత్రి, 23 ఆగస్టు 2013:

తెలుగు ప్రజలను రెండుగా విభజించిన పాపం సోనియా గాంధీదేనని వైయస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షురాలు  బోయ సుశీలమ్మ విమర్శించారు. సమరదీక్ష చేస్తున్న శ్రీమతి వైయస్ విజయమ్మకు మద్దతుగా తాడిపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సీఈసీ సభ్యుడు పైలా నరసింహయ్యను పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రమీలమ్మతో కలిసుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగానే అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు ప్రజలను విభజించారన్నారు.  ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ విభజనపై ప్రకటన వెలువడినప్పటి నుంచి సీమాంధ్ర జిల్లాల్లో  ఉద్యమం చేస్తున్నా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అనంతరం పైలాకు రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట మహిళా విభాగం పట్టణ కన్వీనర్ లక్ష్మి, మైనార్టీ మహిళా నాయకురాలు హసీనా, హుసేన్‌బీ, పద్మావతి తదితరులు ఉన్నారు.

Back to Top