సైకిల్‌ రెండు టైర్లు పంక్చర్‌ చేయాలి

నంద్యాల: నంద్యాలను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఇద్దరు సూర్యులు, ఇద్దరు చంద్రులను ఏమైనా తీసుకొచ్చారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మహ్మద్‌ రెహ్మాన్‌ అన్నారు. నంద్యాల టౌన్‌ శ్రీనివాస సెంటర్‌లో రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు.  చావో రేవో అనే రీతిలో నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి ఓటు వేసి ధర్మం వైపు నిలబడి అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించారని గుర్తు చేశారు. నంద్యాలలో సైకిల్‌కు రెండు టైర్లు పంక్చర్‌ చేసి ఇంటికి పంపించాలన్నారు. 

Back to Top