భూమా నాగిరెడ్డికి బెయిల్‌

క‌ర్నూలు : అక్ర‌మంగా అరెస్టు చేసిన నంధ్యాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా
నాగిరెడ్డికి బెయిల్ ల‌భించింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా
తెలుగుదేశం నాయ‌కులు అక్ర‌మంగా భూమా ను అరెస్టు చేయించిన సంగ‌తి తెలిసిందే.
కుమార్తె అఖిల ప్రియ తో దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న పోలీసుల్ని ఆయ‌న ఆపి
ప్ర‌శ్నించినందుకు గాను కేసులు పెట్టించారు. ఐపీసీ సెక్ష‌న్ 353, 188, 506
ల‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఆ త‌ర్వాత ఆయ‌న
అనారోగ్యానికి గుర‌వ‌టంతో ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. స్థానిక
ఎస్సీ, ఎస్టీ కేసుల విచార‌ణ న్యాయ‌స్థానం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి
బెయిల్ మంజూరు చేసింది.

Back to Top