నీతి మాలిన రాజ‌కీయాలు

తిరుప‌తి:  దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి ఆశ‌య‌సాధ‌న కోసం స్థాపించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తిరుప‌తి వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు భూమాన క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో జెండావిష్క‌ణ చేశారు. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, టీడీపీ నాయ‌కులు వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై చేస్తున్న అనేక ఆరాచ‌కాల‌ను లెక్క‌చేయ‌కుండా పార్టీ ప‌టిష్ట‌త కోసం పాటుప‌డుతున్న వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దేశం ఒక గోప్ప నాయ‌కుడు డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని కోల్పొయి శూన్యమైన ఆ నాయ‌కుడి ఆశ‌య సాధ‌న కోసం అతిచిన్న‌వ‌య‌స్సులోనే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని స్థాపించార‌ని వివ‌రించారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న పార్టీని బ‌ల‌హీన ప‌ర్చ‌డానికి అనేక ప్ర‌భుత్వాలు ఏకమై ఎన్ని అక్ర‌మ కేసులు పెట్టిన వాటిని జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి ధీటుగా ఎదుర్కొని ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నార‌న్నారు. కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు నీతిమాలిన రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతు రాజ‌కీయ నైతిక విలువ‌ల్ని కాల‌రాస్తున్నార‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఉన్న ఆస్తి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్యక్తిత్వ‌మేన‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్ వైఎస్సార్‌సీపీదేన‌ని వివ‌రించారు.
Back to Top