మ‌హిళ‌ల ఉసురు త‌గ‌ల‌డం ఖాయం

మోడీ స‌ర్కార్ అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దును అంద‌రూ స‌మ‌ర్థించార‌ని..కానీ ఇప్ప‌డు బంగారు జోలికి వ‌చ్చి త‌ప్పు చేస్తున్నార‌న్నార‌ని మండిప‌డ్డారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా భూమ‌న మాట్లాడుతూ ఒక ప‌క్క  పెద్ద‌నోట్ల ర‌ద్దుతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతుంటే ఇప్పుడు బంగారంపై ఆంక్ష‌లు పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు. మ‌హిళ‌ల బంగారు జోలికి వ‌స్తే మాత్రం వాళ్ల ఉసురు మోడీకి త‌గ‌ల‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టికైనా కేంద్ర స‌ర్కార్ ఈ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Back to Top