బాబు ఇంటి నిర్మాణం వెనుక అంత‌ర్యం ఏంటీ?

హైద‌రాబాద్‌: అంద‌ర్ని అమ‌రావ‌తికి రండి అని పిలుచుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు హైద‌రాబాద్‌లో విలాస‌వంత‌మైన ఇల్లు నిర్మించుకోవ‌డం వెనుక ఉన్న అంత‌ర్యం ఏంట‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా మోసం చేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన భూమ‌న చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానాలను తూర్పార‌బ‌ట్టారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో 48 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మిస్తే..చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రికి కూడా ప‌క్కా ఇల్లు నిర్మించ‌లేద‌ని, ఆయ‌న మాత్రం హైద‌రాబాద్‌లో  భూత‌ల స్వ‌ర్గాన్ని త‌ల‌పించే విలాస‌వంత‌మైన భ‌వంతి నిర్మించుకున్నార‌ని విమ‌ర్శించారు.

Back to Top